Share News

చైర్మన్‌ కోసం ఢిల్లీ సిఫార్సులు

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:39 AM

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక రకరకాల మలుపులు తిరుగు తోంది. ఢిల్లీలో పాలక పెద్దలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనసుకు అనుగుణంగా అక్కడి నుంచి సిఫార్సులు చేయించడం ప్రారంభమైంది. దీంతో వ్యవ హారం ఏ మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

చైర్మన్‌ కోసం ఢిల్లీ సిఫార్సులు
ఒంగోలులోని జడ్పీ కార్యాలయం

జెన్‌జీపై టీడీపీ దృష్టి ఏమవుతుందో..!

ఉత్కంఠ రేపుతున్న జిల్లా పరిషత్‌ వ్యవహారం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక రకరకాల మలుపులు తిరుగు తోంది. ఢిల్లీలో పాలక పెద్దలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనసుకు అనుగుణంగా అక్కడి నుంచి సిఫార్సులు చేయించడం ప్రారంభమైంది. దీంతో వ్యవ హారం ఏ మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. జడ్పీ చైర్మ న్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయిన విషయం విదితమే. జిల్లాలో ఏడు స్థానాల నుంచి టీడీపీ, ఒకచోట బీజేపీ అభ్యర్థులు జడ్పీటీసీలుగా ఆ కేటగిరీలో గెలుపొందారు. టీడీపీకే జడ్పీ చైర్మన్‌ పదవి లభించబోతుం దన్న సమాచారంతో ఆ పార్టీలో గెలిచిన వారి నుంచి పోటీ పెరిగింది. తొలుత హైదరాబాద్‌లో బిల్డర్‌గా ఉంటూ కందుకూరు నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందిన నాయకుడు పార్టీకి ఆర్థికంగా సహకరించి పదవి పొందాలని ప్రయత్నం చేశారు. అయితే దళితులకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో ముందుగా పార్టీకి ఆర్థిక సహకారం తీసుకోకూ డదని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అంతేగాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని ఎమ్మెల్యేలతో మాట్లాడు తూ మీరే ఆర్థిక వనరులు సమకూర్చుకుని పార్టీ అభ్యర్థులను గెలిపిం చండి. గెలిచిన వారిలో ఉత్తములను చూసి చైర్మన్‌ను చేస్తే భవిష్యత్తులో మనకు మంచి నాయకులు తయారవుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం టీడీపీ అధిష్ఠానం జెన్‌జీ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దళిత వర్గం నుంచి గెలుపొందిన వారిలో యువతీయువకుల కోసం పరిశీలించింది. ఇద్దరు యువతులు, ఒక యువకుడు పార్టీ నుంచి గెలు పొంది ఉన్నారు. వారు విద్యాధికులు కూడా. దాదాపు టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీలో ఉండటమే గాక గ్రామ స్థాయి నుంచి పార్టీలో అనేక పదవులు నిర్వహించిన జడ్పీటీసీని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవికి ఢిల్లీ నుంచి సిఫార్సులు పెరుగుతున్నట్లు సమాచారం. జడ్పీటీసీగా గెలుపొందిన బిల్డర్‌ సోదరుడు ఢిల్లీలో ఐఆర్‌ఎస్‌ అధికారి. కీలకమైన ఆర్థికశాఖలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. తదనుగుణంగా అక్కడి నుంచి నేరుగా టీడీపీ అధిష్ఠానంకు సిఫార్సులు చేయించటం ప్రారంభమైనట్లు తెలిసింది. ఆర్థికశాఖ అన్నా ఆ శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నా రాష్ట్రానికి మరిన్ని నిధులు రాబట్టాలన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడు ఇచ్చే ప్రాధాన్యత జగమెరిగిన సత్యం. దీంతో ఆ సిఫార్సులే ఫలిస్తాయన్న అనుమానాలు టీడీపీ ముఖ్య నాయకుల మధ్య చక్కర్లు కొడుతున్నాయి.

Updated Date - Nov 18 , 2026 | 02:39 AM