విద్యాశాఖలో పోస్టుల పునర్‌వర్గీకరణ
ABN , Publish Date - Oct 28 , 2026 | 02:12 AM
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్యాశాఖలో పోస్టులను స్థానిక, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అందులో మార్పులు చేసింది.
మార్పులతో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు
ఒంగోలు విద్య, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్యాశాఖలో పోస్టులను స్థానిక, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి పోస్టులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అందులో మార్పులు చేసింది. కొన్ని పోస్టులను పునర్‌వర్గీక రించింది. ఈమేరకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి కె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టును గతంలో రాష్ట్రస్థాయిగా వర్గీకరించారు. ప్రస్తుతం దాన్ని మల్టీ జోనల్ స్థాయికి కుదిం చారు. డీఈవోలను మల్టీజోన్ పరిధిలో నియమిస్తారు. ఉప విద్యాధికారులు, డైట్ సీనియర్ అధ్యాపకులు, ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్, పీఈఎస్‌సీ కోఆర్డినేటర్ పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా వర్గీకరించారు. వీటిని పాఠశాల విద్య డైరెక్టర్ భర్తీ చేస్తారు. వీరి నియామకాలు, బదిలీలు ఆయా మల్టీజోన్ల పరిధిలోనే జరుగుతాయి. మండల విద్యాధికారి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డైట్ లెక్చరర్స్, డైట్ ఫిజికల్ ఎడ్యు కేషన్ లెక్చరర్, రీజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మండల విద్యాధికా రి-2 పోస్టులను జోనల్ స్థాయి పోస్టులుగా గుర్తించారు. వీరిని పాఠశాల విద్య ప్రాం తీయ జాయింట్ డైరెక్టర్ నియమిస్తారు. వీరి నియామకాలు, బదిలీలు, ఆయా జోన్ల పరిధిలోని జిల్లాలకే పరిమితమవుతాయి. ఈ పోస్టుల నియామకాల్లో స్థానిక అభ్యర్థు లకు 95శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.