Share News

యోగా డేకి రెడీ

ABN , Publish Date - Jun 21 , 2026 | 03:01 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యా ప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుతో అవసరమైన చర్యలు తీసుకుంది.

యోగా డేకి రెడీ

నేడు జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు

ఒంగోలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోభారీ ఏర్పాట్లు

పాల్గొననున్న మంత్రి స్వామి, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్వహణ

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం జిల్లావ్యా ప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుతో అవసరమైన చర్యలు తీసుకుంది. రెండు వారాల నుంచి జిల్లావ్యాప్తంగా నిర్దేశిత ప్రాంతాల్లో యోగాసనాల సాధన కొనసాగింది. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఒంగోలులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి డాక్టర్‌ స్వామితోపాటు కలెక్టర్‌ రాజాబాబు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. డివిజన్‌, మండల, గ్రామస్థాయిలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే యోగాకు మూడు లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వారందరూ వారివారి ప్రాంతాల్లో పాల్గొననున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 03:01 AM