Share News

పరిషత్‌ పోరుకు సై

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:51 AM

జిల్లా పరిషత్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కీలకమైన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కాపురం జడ్పీ చైర్మన్‌ పదవి అన్‌రిజర్వుడ్‌ కాగా, ప్రకాశం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీంతో టీడీపీకి చెందిన ఎర్రగొండపాలెం, దర్శి ఇన్‌చార్జులు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మిల ఆశలు గల్లంతయ్యాయి.

పరిషత్‌ పోరుకు సై

జడ్పీ చైర్మన్‌ల రిజర్వేషన్లు ఖరారు

మార్కాపురం ఓసీ

ప్రకాశం ఎస్సీ జనరల్‌

అక్కడ ఎరిక్షన్‌బాబు, ఇక్కడ లక్ష్మి ఆశలపై నీళ్లు

ప్రకాశంలో అభ్యర్థిపై ముమ్మర పరిశీలన

(ఒంగోలు, ఆంధ్రజ్యోతి)

జిల్లా పరిషత్‌ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కీలకమైన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కాపురం జడ్పీ చైర్మన్‌ పదవి అన్‌రిజర్వుడ్‌ కాగా, ప్రకాశం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీంతో టీడీపీకి చెందిన ఎర్రగొండపాలెం, దర్శి ఇన్‌చార్జులు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మిల ఆశలు గల్లంతయ్యాయి. మార్కాపురం దళితులకు రిజర్వు అయితే ఎరిక్షన్‌బాబుకు ఇవ్వాలని, ప్రకాశం అన్‌రిజర్వ్‌లో ఉంటే లక్ష్మికి అవకాశం కల్పించాలని ఆ పార్టీలోని ఎక్కువ మంది నేతలు అధిష్ఠానానికి సూచించారు. రిజర్వేషన్‌లు తారుమార వడంతో టీడీపీ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. మార్కాపుం జడ్పీ చైర్మన్‌ కోసం మార్కాపురానికి చెందిన కందుల రామిరెడ్డి, కనిగిరి నియోజకవర్గానికి చెందిన శ్యామల కాశిరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన శనగా నారాయణరెడ్డి విశ్వప్రయత్నాల్లో ఉన్నారు. ఆ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఇక ప్రకాశం జిల్లాలో ఎస్సీ అభ్యర్థి కోసం మంగళవారం అధిష్ఠానం విస్తృత సర్వే చేయించింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ తన సోదరుడికి అవకాశం ఇస్తే అవసరమైన ఆర్థిక అవసరాలు కూడా వద్దని టీడీపీ అధిష్ఠానానికి సమాచారం పంపారు. అదేసమయంలో తమకు అవకాశం కల్పించాలని మంత్రి రవికుమార్‌, ఎమ్మెల్యే జనార్దన్‌ను కొందరు ఆశావహులు మంగళవారం రాత్రి వచ్చి కలిశారు. ఉద్యోగ విరమణ చేసిన ఇద్దరు అధికారులు కూడా ఆ పదవిని ఆశిస్తూ నేతల వద్దకు తిరుగుతున్నారు.

Updated Date - Oct 14 , 2026 | 02:51 AM