భూ అక్రమాలపై ఆర్డీవో విచారణ
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:07 AM
ఒంగోలు కార్పొరేషన్ పరి ధిలోని పేర్నమిట్ట వద్ద 136/4బీ సర్వే నెంబరులో భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన కలెక్టర్ రాజాబాబు సమగ్ర విచారణ చేసి నివేదికను అందజే యాలని ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడును ఆదేశించారు.
అప్పటి తహసీల్దార్, సర్వేయర్లకు నోటీసులు
భూమికి సంబంధించిన రికార్డుల పరిశీలన
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు కార్పొరేషన్ పరి ధిలోని పేర్నమిట్ట వద్ద 136/4బీ సర్వే నెంబరులో భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన కలెక్టర్ రాజాబాబు సమగ్ర విచారణ చేసి నివేదికను అందజే యాలని ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడును ఆదేశించారు. ఇప్పటికే ఆ భూమికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్డీవో సేకరించారు. 136/4బీ సర్వేనెంబరు సబ్ డివిజన్ చేసిన సమయంలో పనిచేసిన అప్పటి సంతనూతలపాడు తహసీల్దార్ ఎస్.శ్రీనివాసరావు, మండల సర్వేయర్ నాళం వెంకటేశ్వర్లును బుధవారం విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత తహసీల్దార్‌ను కూడా మంగళవారం ఆర్డీవో కార్యాలయా నికి పిలిపించి మాట్లాడారు. భూమికి సంబంధించిన రికార్డులను కూడా తెప్పించి పరిశీలిస్తున్నారు. దీంతో ఆ భూమి సబ్‌డివిజన్ జరిగిన సమ యంలో అక్కడ పనిచేసిన మరికొందరు అధికారుల్లో ఆందోళన నెలకొంది.