Share News

నేటి నుంచే రేషన్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 02:56 AM

జిల్లాలో మంగళవారం నుంచి రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభ మవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 1,045 దుకాణాల పరిధిలో 5,16,806 రేషన్‌ కార్డుదారులు ఉన్నారు.

నేటి నుంచే రేషన్‌

ఈసారి కూడా బియ్యం, పంచదారకే పరిమితం

కొన్నిప్రాంతాల్లో పంపిణీకి జొన్నలు సిద్ధం

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం నుంచి రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభ మవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 1,045 దుకాణాల పరిధిలో 5,16,806 రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. ఇప్పటికే 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సరుకు లను డీలర్లు పంపిణీ చేశారు. మంగళవారం నుంచి రేషన్‌షాపుల ద్వారా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇవ్వనున్నారు. ఈసారి కూడా బియ్యం, చక్కెరను మాత్రమే పంపిణీ చేయనున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కార్డుదారులకు జొన్నలు ఇవ్వనున్నారు. గత రెండేళ్ల నుంచి కార్డుదారులకు కందిపప్పు లేదు. ఏ నెలకానెల ఇస్తారని ప్రచారం జరుగుతున్నదే తప్ప కార్డుదారులకు మాత్రం కందిపప్పు అందని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Sep 01 , 2026 | 02:56 AM