Share News

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:40 AM

జిల్లాలో రేషన్‌ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది.

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులకు అందజేత

ఈసారి కూడా బియ్యం, చక్కెర మాత్రమే

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రేషన్‌ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 1,045 రేషన్‌ దుకాణాల పరిధిలో 5,16,806 కార్డుదారులున్నారు. ఇప్పటికే 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. గురువారం నుంచి రేషన్‌ దుకాణాల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇవ్వనున్నారు. జిల్లాలోని కార్డుదారులకు గత రెండేళ్ల నుంచి కందిపప్పు ఇవ్వడం లేదు. ఈసారి కూడా బియ్యం, పంచ దారను మాత్రమే పంపిణీ చేయనున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్డుదారులకు జొన్నలు ఇవ్వనున్నారు.

Updated Date - Oct 01 , 2026 | 01:40 AM