రేషన్ పంపిణీ ప్రారంభం
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:24 AM
జిల్లాలో గురువారం నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది. 15వతేదీ వరకు కార్డుదారులకు సరుకులు అందజేస్తారు.
తొలిరజు 28శాతం మందికి సరుకులు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గురువారం నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది. 15వతేదీ వరకు కార్డుదారులకు సరుకులు అందజేస్తారు. ఈసారి ఒంగోలు అర్బన్ ప్రాంతంలో రేషన్ బియ్యంతో పాటు చక్కెర, కిలో గోధుమ పిండిని కార్డుదారులకు ఇస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం, చక్కెరతోపాటు కొన్నిప్రాంతాల్లో జొన్నలు పంపిణీ చేశా రు. జిల్లాలో 1,392 రేషన్‌షాపుల పరిధిలో 6.62లక్షల కార్డుదారులు ఉండగా గురువారం సుమారు 28శాతం మంది సరుకులు తీసుకున్నట్లు సమాచారం. రేషన్ పంపిణీ ఉదయం, సాయంత్రం రెండు పూటలా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో గతనెల 26వతేదీ నుంచి దివ్యాంగులు, 60ఏళ్లు పైబడిన వృద్ధులకు రేషన్ అందించారు. ఒంగోలులోని పలు రేషన్ దుకాణాలను గురువారం డీఎస్‌వో పద్మశ్రీ పరిశీలించారు.