Share News

వేగంగా రేషన్‌ పంపిణీ

ABN , Publish Date - Sep 02 , 2026 | 02:43 AM

జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభమైన రేషన్‌ పంపిణీ వేగవంతంగా కొనసాగుతోంది. మొత్తం 1,045 షాపుల పరిఽధిలో ఉదయం, సాయంత్రం సమయంలో కార్డుదారులకు డీలర్లు సరుకులు అందజేశారు.

వేగంగా రేషన్‌ పంపిణీ
కందుకూరులోని రేషన్‌షాపులో బియ్యం పంపిణీని పరిశీలిస్తున్న డీఎస్‌వో

కందుకూరులో దుకాణాలను పరిశీలించిన డీఎస్‌వో పద్మశ్రీ

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభమైన రేషన్‌ పంపిణీ వేగవంతంగా కొనసాగుతోంది. మొత్తం 1,045 షాపుల పరిఽధిలో ఉదయం, సాయంత్రం సమయంలో కార్డుదారులకు డీలర్లు సరుకులు అందజేశారు. రెండు, మూడు మండలాల్లో సర్వర్‌ సమస్య కారణంగా కొంత వెనుకబడగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కార్డుదారులకు సరుకుల పంపిణీ కొనసాగింది. జిల్లాలో 5,19,694 తెల్లరేషన్‌కార్డులు ఉండగా మంగళవారం సాయంత్రానికి 70వేలకుపైగా కార్డుదారులకు సరుకులను అందజేశారు. జిల్లా పౌరస రఫరాల శాఖ అధికారి పద్మశ్రీ కందుకూ రులో రేషన్‌ షాపుల్లో జరుగుతున్న పంపి ణీని పరిశీలించారు. కార్డుదారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. డీలర్లకు పలు సూచనలు చేశారు. దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు.

Updated Date - Sep 02 , 2026 | 02:43 AM