Share News

సీఎం సభకు వేగంగా ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 02:39 AM

జరుగుమల్లి మండలం నర్సింగోలులో ఈనెల 9న జరిగే సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లను కలెక్టర్‌ రాజాబాబు, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం వేర్వేరుగా పరిశీలించారు.

సీఎం సభకు వేగంగా ఏర్పాట్లు
హెలిప్యాడ్‌ వద్ద ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

పనులను పరిశీలించిన కలెక్టర్‌, నాయకులు

నర్సింగోలు (కొండపి), అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : జరుగుమల్లి మండలం నర్సింగోలులో ఈనెల 9న జరిగే సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్లను కలెక్టర్‌ రాజాబాబు, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం వేర్వేరుగా పరిశీలించారు. సభావేదిక, హెలిప్యాడ్‌ నిర్మాణం, సెక్యూరిటీ, కార్యకర్తలతో సమావేశ వేదిక, ఫొటో ఎగ్జిబిషన్‌, రచ్చబండ స్థలాలను సంబంధిత పరిశీలకులతో కలిసి కలెక్టర్‌ చూశారు. ఇతర ఏర్పాట్లను అధికారు లను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు జేసీ కల్పనా కుమారి, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ హిమవంశీ, ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ‘మీ భూమి-మీహక్కు’ పాస్‌ పుస్తకాల రైతులు, రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు కె.వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, ఎస్‌.శ్రీనివాసరావు, క్షేత్రస్థాయి సిబ్బందితో చర్చించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్‌, ట్రాఫిక్‌ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు, బంగారయ్య, టీడీపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్యచౌదరి, పొన్నలూరు మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, పార్టీ జరుగుమల్లి, టంగుటూరు, కొండపి మండలాల అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, చదలవాడ చంద్రశేఖర్‌, కొర్రపాటి వసంతరాయుడు, నాయకులు పోటు రవీంద్రబాబు, కొమ్మాలపాటి కృష్ణ, నలమోతు వెంకటేశ్వర్లు, కోనూరి సుబ్బారావు, బత్తిన పూర్ణ, పాతూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 02:39 AM