Share News

ముదిగొండి వాగులో అడ్డగోలుగా తవ్వకాలు

ABN , Publish Date - May 20 , 2026 | 12:08 AM

ఒంగోలు మండలం కరవది రెవెన్యూ పరిధిలో గల ముదిగొండి వాగును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గుల్లగుల్ల చేస్తు న్నారు. అడ్డగోలు తవ్వకాలతో వాగును ధ్వంసం చేసేస్తు న్నారు.

   ముదిగొండి వాగులో అడ్డగోలుగా తవ్వకాలు

అడ్డూ అదుపు లేని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల దందా

రోజుకు 200 లోడులు పైనే మట్టి తరలింపు

చెక్‌డ్యాంలో నీరు ఉప్పుగా మారే వైనం

పలు గ్రామాల రైతుల ఆందోళన

ఒంగోలు(రూరల్‌), మే19(ఆంధ్రజ్యోతి): ఒంగోలు మండలం కరవది రెవెన్యూ పరిధిలో గల ముదిగొండి వాగును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు గుల్లగుల్ల చేస్తు న్నారు. అడ్డగోలు తవ్వకాలతో వాగును ధ్వంసం చేసేస్తు న్నారు. రాత్రిపగలు తేడా లేకుండా 20టిప్పర్లు, రెండు ఎక్స్‌కవేటర్లతో యథేచ్చగా తవ్వకాలు చేస్తూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సుమారుగా 200 టిప్పర్లు వారం రోజులుగా తరలిస్తున్నా ఎవరూ పట్టిం చుకోకపోవడంపై ప్రజలు విస్మయం చేస్తున్నారు. సం బంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముదిగొండి వాగులో సు మారుగా 15నుంచి 20 అడుగులు లోతున తవ్వకాలు చేయడంతో ఉప్పునీటి వస్తోంది. ముఖ్యంగా ఒంగోలు మండలం చేజర్ల గ్రామం ఎదురు ముదిగొండివాగుపై చెక్‌ డ్యామ్‌ ఉంది. ప్రస్తుతం ఈ చెక్‌డ్యాంలో పుష్కలం గా సాగునీరు ఉన్నది. ఏదైనా పై నుంచి ఉప్పునీటి ఊ ట వస్తే చెక్‌డ్యాంలో నీరు కూడా ఉప్పుగా మారి ఎం దుకూ పనికరాకుండా పోయో ప్రమాదం ఉందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ముది గొండివాగులో అడ్డదిడ్డంగా తవ్వకాలు చేస్తుండడంతో వర్షాకాలంలో వరదలు వస్తే ఆ ప్రభావం దాని చుట్టు పక్కల గ్రామాలపై పడే అవకాశం ఉందని చేజర్ల, కరవది, పాతపాడు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ముదిగొండి వాగులో మట్టితవ్వకాలకు ఎలాంటి అను మతులు లేవు. రూ.కోట్లు విలువ చేసే మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నారు. ఒంగో లు నుంచి చెత్తను డంపిగ్‌ చేసే యార్డును కూడా వ దలకుండా తవ్వకాలు చేశారు. అంతేగాకుండా ముది గొండివాగులో ఇప్పడు తవ్విన గుంతల్లో పడితే మను షులే కాదు పశువులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పం దించి అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డు కుని జలవనరులను కాపాడాలని పరివాహపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయపై ఆంధ్రజ్యోతి మం గళవారం మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈని వివరణ కోరింది. ముదిగొండివాగులో మట్టి తవ్వకాల సమాచారం ఇప్ప టి వరకు తనకు తెలియదన్నారు. తక్షణమే పరిశీలించి మట్టి తవ్వకాలను నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:08 AM