Share News

రేణంగివరంలో ఉత్సాహభరితంగా పొట్టేళ్ల పోటీలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:26 PM

పంగులూరు, మండలంలోని రేణంగివరంలో గురువారం రాష్ట్రస్థాయి పొట్టేళ్ల పందేలు ఉత్సాహభరితంగా సాగాయి.

రేణంగివరంలో ఉత్సాహభరితంగా పొట్టేళ్ల పోటీలు
పందెంలో తలపడుతున్న పొట్టేళ్లు

పంగులూరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి) : మండలంలోని రేణంగివరంలో గురువారం రాష్ట్రస్థాయి పొట్టేళ్ల పందేలు ఉత్సాహభరితంగా సాగాయి. గొట్టిపాటి యువసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలలో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి 41 పొట్టేళ్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. పోటీలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోటీల కోసం ఏర్పాటు చేసిన బరి వద్ద సందడి నెలకొంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోటీలలో ప్రథమ బహుమతి కాకుమాను బాలకృష్ణ దక్కించుకోగా మేదరమిట్ల రవి, కొణిదన మణి, రేణంగివరం గంగమ్మతల్లి పొట్టేళ్లు వరుస బహుమతులు గెలుపొందాయి.

పొట్టేళ్ల యజమానులకు మండల టీడీపీ నాయకులు బోరెడ్డి ఓబుల్‌రెడ్డి బహుమతులు అందజేశారు.

Updated Date - Jan 01 , 2026 | 11:26 PM