Share News

ఉలిచిలో పొట్టేళ్ల పోటీలు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:19 PM

ఒంగోలు రూరల్‌ మండలంలోని ఉలిచి గ్రామంలో శుక్రవారం పొట్టేళ్ల పోటీలు పోటాపోటీగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి 25 పొటేళ్లు పాల్గొన్నాయి.

ఉలిచిలో పొట్టేళ్ల పోటీలు
ఢీ అంటే ఢీ అంటున్న పొట్టేళ్లు

ఒంగోలు(రూరల్‌)జనవరి16 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఉలిచి గ్రామంలో శుక్రవారం పొట్టేళ్ల పోటీలు పోటాపోటీగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి 25 పొటేళ్లు పాల్గొన్నాయి. ప్రథమవిజేత(ఉలిచి) కంచర గుంట శ్రీనివాసరావుకి రూ.20 వేలు, ద్వితీయ విజేత(నెకనంబాడు) విల్లాపెద్దమ్మకు రూ.15వేలు, తృతీయ విజేత(నాగంబొట్లపాలెం) నాలి వెంకటప్రసాదుకు రూ.10వేలు, 4వ విజేత పోలేరమ్మ తల్లి(నెకనంబాడు) రూ.5వేలు నగదు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ సభ్యులు చుంచు శింగయ్య, మండవ సుబ్బారావు, మన్నె హరిబాబు, నన్నపనేని వెంకటరావు, చుంచు లక్ష్మీనారాయణ, పోకూరి వెంకటేశ్‌, మండవ మల్లికార్జున, యర్రా ఆంజనేయులు, యర్రంనేని వెంకటశేషయ్య, చుంచు రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:19 PM