Share News

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:10 AM

రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సోమవారం వారు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి టంగుటూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మి కంగా తనిఖీ చేశారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య

మంత్రులు స్వామి, సవిత

టంగుటూరులోని బీసీ బాలికల గురుకులం ఆకస్మిక తనిఖీ

విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు విచారణ

తక్షణం స్కూల్‌కు రూ.4లక్షలు మంజూరు చేసిన మంత్రి సవిత

కొండపి (టంగుటూరు), జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సోమవారం వారు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి టంగుటూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను పరిశీలించారు. అక్కడ విద్యార్థినులతో మాట్లాడారు. వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. భోజన వసతులు, నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్డు టెలిఫోన్‌ సదుపాయాన్ని పరిశీలించిన మంత్రులు స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. పాఠశాలలోని క్రీడాకారులకు క్రీడా దుస్తులు, బూట్లు అందజేశారు. గతేడాది ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు, బోధనలో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల తక్షణ వసతుల కోసం రూ.4లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్‌, నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, బెల్లం జయంత్‌బాబు, టంగుటూరు తహసీల్దార్‌ అంజనేయులు పాల్గొన్నారు.

సీసీ రోడ్ల పరిశీలన..

స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను సోమవారం సాయంత్రం మంత్రి స్వామి తనిఖీ చేశారు. అధికారుల సమక్షంలో నాణ్యతను పరిశీలించారు. డ్రెయిన్‌ల నిర్మాణంలో పలు భౌతిక మార్పులు చేయాలని సంబంధిత అఽధికారులకు సూచించారు.

Updated Date - Jul 14 , 2026 | 03:10 AM