Share News

28న పల్స్‌పోలియో

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:02 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 28వతేదీ నుంచి మూడు రోజులపాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

28న పల్స్‌పోలియో

29, 30 తేదీల్లో ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌

ఏర్పాట్లు చేస్తున్న వైద్యశాఖ

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 28వతేదీ నుంచి మూడు రోజులపాటు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకు వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2,42,112 మంది జీరో నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఈనెల 28వతేదీన ప్రారంభం రోజునే సుమారు 90శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేసేవిధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మిగిలిన రెండు రోజులు ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలకు వేస్తారు. మరోవైపు గిరిజన ప్రాంతాలు, తాండాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన కూడళ్లు, మార్కెట్‌ సెంటర్లు, జాతీయ రహదారులపై మొబైల్‌ వాహనాల ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 01:02 AM