Share News

పెండింగ్‌ నిర్వాసితుల జాబితా ప్రచురణ

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:50 AM

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో గెజిట్‌లో పేర్లు మిస్సయ్యాయని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టి ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌అండ్‌ఆర్‌లో అనుభవం ఉన్న ఇతర ప్రాజెక్టుల పరిధిలో పనిచేసిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, స్థానికంగా ఉన్న జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు విచారణ చేశాయి.

పెండింగ్‌ నిర్వాసితుల జాబితా ప్రచురణ
నోటీ్‌స బోర్డులో జాబితా ఉంచిన మార్కాపురం తహసీల్దార్‌ చిరంజీవి

గెజిట్‌లో మిస్సయి అర్హులైన 321 మంది పేర్లు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రదర్శన

మార్కాపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో గెజిట్‌లో పేర్లు మిస్సయ్యాయని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టి ప్రాథమికంగా అర్హుల జాబితాను తయారు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌అండ్‌ఆర్‌లో అనుభవం ఉన్న ఇతర ప్రాజెక్టుల పరిధిలో పనిచేసిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, స్థానికంగా ఉన్న జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు విచారణ చేశాయి. మిస్సయిన వారిలో అర్హులుగా గుర్తించిన 321 మంది జాబితాను ప్రచురించారు. ఈ జాబితాను నిర్వాసితుల పరిశీలన కోసం వారివారి తహసీల్దార్‌ కార్యాలయాల్లో నోటీస్‌ బోర్డుల్లో ఉంచారు. పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల తహసీల్దార్‌లు వాటిని నోటీ్‌స బోర్డుల్లో ఉంచి పరిశీలించుకోవాలని నిర్వాసితులకు తెలిపారు. ఇవి కాకుండా 31 ఆగస్టు 2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని కూడా గుర్తించి 731 మంది పేర్లు తయారు చేశారు. వీరికి ప్రభుత్వం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

మేజర్లు అయిన నిర్వాసితుల సర్టిఫికెట్లు నేడు పరిశీలన

వెలిగొండ నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన (మేజర్‌) యువతీ, యువకుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. అర్హులైన వారు తమ ధ్రువపత్రాలతో మార్కాపురంలోని మార్కెట్‌ యార్డులో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. గ్రామాలవారీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో అధికారులకు అవసరమైన అన్ని ఒరిజినల్‌ పత్రాలను చూపించి, పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ నిర్వాసితులకు సూచించారు.

Updated Date - Sep 23 , 2026 | 01:50 AM