Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Oct 13 , 2026 | 10:48 PM

ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రూ.67.44లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామ, రైతు సేవా కేంద్ర భవనాలతో పాటు, సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా రూ.11.50లక్షలతో నిర్మించిన వాటర్‌ ప్లాంట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
స్వర్ణ గ్రామ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి

రాచర్ల, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రూ.67.44లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామ, రైతు సేవా కేంద్ర భవనాలతో పాటు, సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా రూ.11.50లక్షలతో నిర్మించిన వాటర్‌ ప్లాంట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటిందని, ఈ కాలంలో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తాగునీరు, సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లతోపాటు గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఏ గ్రామం కూడా అభివృద్ధికి నోచుకోలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీ లు కూడా నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరింత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. నియోజనకవర్గస్థాయిలో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి గతంలో ఎన్నడులేని విధంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రజలను కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన అశోక్‌ రెడ్డికి గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక పీడీవోలు కే శివ రామకృష్ణ, బీ బాలస్వామి, స్వర్ణగ్రామ కార్యాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు, టీడీపీ మండల అధ్యక్షుడు కే యోగానంద్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుప్ప రంగసాయి, సొసైటీ బ్యాంకు చైర్మన్‌ జీ జీవనేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎం బ్రహ్మయ్య, ఎస్సీ సెల్‌ నాయకుడు గుర్రం డానియేల్‌, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 10:48 PM