Share News

పజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:29 PM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మొదటి రోజే 100 శాతం పింఛన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. పూలసుబ్బయ్య కాలనీ, బిలాల్‌ మసీద్‌ వద్ద ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొన్నారు.

పజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాచర్లలో పింఛన్‌ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం వన్‌టౌన్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మొదటి రోజే 100 శాతం పింఛన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. పూలసుబ్బయ్య కాలనీ, బిలాల్‌ మసీద్‌ వద్ద ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్లను అందజేసి లబ్ధిదారులతో మాట్లాడారు. వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఇళ్లకు వచ్చి మరీ పింఛన్‌లను అందజేస్తున్నారన్నారు. 1వ తేదీ వచ్చిందంటే పింఛన్‌ కోసం ఎదురుచూసే వృద్ధుల వద్దకు వెళ్లి నేరుగా వెళ్లి అందజేస్తున్నారన్నారు. జిల్లాలో 1.46లక్షల మందికి పింఛన్లు అందజేశామని, దివ్యాంగ, వితంతు పింఛన్లు జిల్లాలో 132 కొత్తగా మంజూరయ్యాయని, వాటిలో మార్కాపురం పట్టణంలో 2 నూతనంగా మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుంటక సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్‌ ఇబ్రహీం ఖాన్‌, నాయకులు రమణ, మేడిద రంగస్వామి పాల్గొన్నారు.

ప్రతి అర్హుడికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం

పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికీ చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. 8వవార్డులో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు పిం ఛన్లు అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించటంలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత ప్రభుత్వాల కంటే మెరుగైన విధంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్య లు తీసుకుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పర్వతనేని శ్రీధర్‌, టీడీపీ రాష్ట్ర రై తు నాయకులు రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్‌, అహ్మద్‌ పాల్గొన్నారు.

పామూరు : ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పామూరు, సీఎ్‌సపురం టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, బొబ్బూరి రమేష్‌ చెప్పారు. ఎన్టీఆర్‌ సామాజిక పింఛన్లను గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి నాయకులు లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో యారవ శ్రీను, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, రమణయ్య, రహీముల్లా, అమీర్‌బాబు, కోటిరెడ్డి, అంచూరి వెంకట్‌రెడ్డి, పాలపర్తి రమణయ్య, ఎన్‌ సాంబయ్య పాల్గొన్నారు.

వృద్ధులకు పింఛన్‌ అండ : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

రాచర్ల : ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక రాములవారి వీధిలో సోమవారం ఆయన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి నెలా 1వ తేదీన పింఛన్‌ అందజేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు చెప్పిన సూపర్‌సిక్స్‌ పథకాలను అమలు చేశామన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చిందని ఆ హామీలు నెరవేర్చామన్నారు. ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరామిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవోలు వెంకటేష్‌, శ్రీనివాస్‌ కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు యోగానంద్‌, సంసైటీ బ్యాంక్‌ అధ్యక్షులు జీవనేశ్వర్‌ రెడ్డి, పుల్లారెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ ట్రెజరర్‌ శ్రీనివాసరెడ్డి, బీసీ, ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధులు శ్రీనివాసులు, సంజయ్‌, స్థానిక నాయకులు సుధీర్‌ కుమార్‌ రెడ్డి, సనావుల్లా ఖాన్‌, కళ్యాణ్‌ రెడ్డి, తాహెర్‌ బాష, కాశిరెడ్డి, రంగస్వామిరెడ్డి, పంచాయతీ అధికారి యంవి నాయక్‌, అన్ని సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్రై సైకిళ్ల పంపిణీ

పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన 16 ట్రై సైకిళ్లు, 7 పుష్‌ కార్ట్‌లను ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోమవా రం పంపిణీ చేశారు. పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. ఎమ్మెల్యేకు కార్యాలయ సిబ్బం ది, సచివాలయ అధికారులు, వారి సిబ్బంది, అన్ని శాఖల అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.

31 కొత్త వితంతు పింఛన్లను అందజేసిన జేసీ

ఎర్రగొండపాలెం రూరల్‌ : ఈనెల నెల నుంచి కొత్తగా 31 వితంతు పింఛన్‌లు మంజూరైనట్లు జేసీ పీ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం అమానిగుడిపాడులో ఆయన ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల యోగక్షేమాలను తెలుసుకొని పింఛన్‌లను పంపిణీ చేశారు. తమ్మడపల్లిలో ప్రతేకాధికారి కే అంజయ్య సిబ్బందితో కలసి పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్‌ డీ మంజునాథరెడ్డి, ఎంపీడీవో బండారు శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, కార్యదర్శి రామారావు నాయక్‌, పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను టీడీ పీ మండల నాయకులు స్థానిక అధికారులతో కలి సి సోమవారం పంపిణీ చేశారు. దోర్నాలలో టీడీ పీ మండలాధ్యక్షుడు షేక్‌ మాబు, హసనాబాద్‌లో టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఈదర మల్ల య్య, చిన్నగుడిపాడులో నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షుడు దొడ్డా శేషాద్రి, సుందరయ్య కాలనీలో ఎస్సీ జిల్లా నాయకులు చంటి లబ్ధిదారులకు అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.

ప్రజా ప్రభుత్వ పాలనతో భరోసా

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

పెద్దారవీడు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వ పాలనతో ప్రజలకు భరోసా ఏర్పడిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని కలనూతలలో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ, గోకులం షెడ్ల ప్రారంభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో వికసిత్‌ భారత్‌ ఉపాధి పనులలో భాగంగా రూ.4లక్షలతో నిర్మించిన రెండు గోకుల షెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. వైసీపీ మో సపూరిత మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేసిందన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాల అమలుతోపాటు పేదలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ హయాంలో గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీడీవో జాన్‌ సుందరం, ఎపీవో సాంబశివయ్య, మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి గొట్టం శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు జడ్డా రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 11:29 PM