విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:43 PM
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఎంపీడీవో కె.సీతారామారావు సూచించారు. గురువారం మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు బంగాళదుంప కూర, గుడ్డుతో భోజనం అందించడం రుచి చూశారు.
గిద్దలూరు టౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఎంపీడీవో కె.సీతారామారావు సూచించారు. గురువారం మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు బంగాళదుంప కూర, గుడ్డుతో భోజనం అందించడం రుచి చూశారు. 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టడం, పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఏఏ సెక్షన్లలో ఉన్నారు అని తెలుసుకున్నారు. 10వ తరగతి 77 మంది విద్యార్థులు ఉన్నట్లు, సాయంత్రం స్టడీ అవర్స్ ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎం తెలిపారు. అనంతరం సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామపంచాయతీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాలువలను తీయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్‌ను పరిశీలించారు. కొంగళవీడు గ్రామాన్ని సందర్శించి గ్రామస్థుల కోరిక మేరకు నూతన మోటారు, పైపులు ఏర్పాటు చేసేందుకు అంచనాలు తయారు చేయాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.