Share News

తాగునీటి కోసం ఆందోళన

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:53 AM

తాగునీటి కోసం నగర పంచా యతీ పరిధిలోని కంభాలపాడు ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో శుక్రవారం కర్నూలు - ఒంగోలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

తాగునీటి కోసం ఆందోళన
రాస్తారోకో చేస్తున్న కంభాలపాడు ఎస్సీ కాలనీ వాసులు

ఖాళీ బిందెలతో కంభాలపాడు ఎస్సీకాలనీ వాసుల రాస్తారోకో

పొదిలి, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : తాగునీటి కోసం నగర పంచా యతీ పరిధిలోని కంభాలపాడు ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో శుక్రవారం కర్నూలు - ఒంగోలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తాగునీటి సమస్యకు పరి ష్కారం చూపేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మిం చారు. గంట సేపు అక్కడే బైఠాయించారు. దీంతో దాదాపు కిలో మీటర్‌కుపైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న పొదిలి ఎస్‌ఐ రాజేష్‌ అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్యను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఈసందర్భంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తాగునీరు సరఫరా అయి ఆరు నెలలు అయిందని వాపోయారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చూస్తానని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.

Updated Date - Jul 11 , 2026 | 02:53 AM