Share News

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే విచారణ

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:28 PM

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇన్‌చార్జి ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే విచారణ
ఫిర్యాదుదారుల సమస్యలను వింటున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

మార్కాపురం టౌన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇన్‌చార్జి ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి సుమారు 41 మంది పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. ప్రతి అర్జీదారుడితో ఎస్పీ మాట్లాడారు. సమస్యలను విని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబందింత పో లీసు స్టేషన్‌ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడించారు. తీసుకుంటున్న చర్యలపై ఎప్పడికప్పుడు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. డీఎస్పీ డాక్టర్‌ యూ నాగరాజు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, మార్కాపురం, పామూరు, త్రిపురాంతకం సీఐలు పి.సుబ్బారావు, శ్రీనివాసరావు, అస్సన్‌, ఎస్సైలు సైదుబాబు, వేమన పాల్గొన్నారు.

సైబర్‌నేరాలపై అవగాహన కల్పించాలి

పొదిలి : సైబర్‌నేరాలు, మాదకద్రవ్యాలవల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అన్నారు. సోమవారం పొదిలి స ర్కిల్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సీఐ రాజే్‌షకుమార్‌, ఎస్‌ఐ రాజేష్‌ ఉన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:28 PM