Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:32 PM

ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు కప్పదాటు ధోరణి తగదని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం ప్రజాసమస్యల పరి ష్కారవేదిక (ప్రజాదర్బార్‌) నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ప్రజా సమస్యల పరిష్కారంలో

అధికారుల కప్పదాటు ధోరణి తగదు

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ప్రజాదర్బార్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, ఫిభ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు కప్పదాటు ధోరణి తగదని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం ప్రజాసమస్యల పరి ష్కారవేదిక (ప్రజాదర్బార్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమాల్లో ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రజల సమస్యల పరిష్కారం కాకపోగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల ఫలితం లేకుండా పోతోందనే వేదన ప్రజల్లో నెలకొందన్నారు. ఈనెల 5వ తేదీ తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమై ఒక్కో అర్జీ సమస్యను అధికారులు పరిష్కరించారో లేదో పరిశీలిస్తామన్నారు. అదే సమయంలో మండలస్థాయి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై నెట్టేసి చేతులు దులుపుకుందామనుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. అర్జీల పరిష్కారంలో ఏఏ అధికారి ఎంత మేర స్పందించారో ఉన్నతాధికారుల సమక్షంలో బహిర్గతం అవుతుందన్నారు. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారుల సమక్షంలోనే శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఎల్‌డీఓ శ్రీనివాసరెడ్డి, సీఐ ఉప్పుశ్రీనివాసులు, ఎంపీడీవోలు అబ్దుల్‌ ఖాదర్‌, రంగసుబ్బారాయుడు పాల్గొన్నారు. ప్రజదర్బార్‌లో వివిధ సమస్యలపై 85 అర్జీలు వచ్చాయి. వాటిలో కేవలం రెవెన్యూ సమస్యలపై 44 అర్జీలు వచ్చాయి. మిగతా ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌టీసీకి సంబంధించిన సమస్యలపై అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలను సంబంధిత శాఖలకు, కలెక్టర్‌ పోర్టల్‌కు పంపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సమస్యలపై నిర్లక్ష్యం వద్దు : ఎమ్మెల్యే కందుల

కొనకనమిట్ల, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా కందుల మా ట్లాడుతూ అధికారులు ప్రజాసమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీల పరిష్కార చర్యలకు సంబంధించి రాష్ట్ర సచివాలయం నుంచి ప్రత్యేక కమిటీని నియమించడంతోపాటు నిఘా ఉందన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పింఛన్‌లు, ఇంటిపట్టాలు, పొలం సమస్యలపై 88 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో ఈశ్వరమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు మోరబోయిన బాబురావు, మండలపార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారావు, చినారికట్ల సొసైటీ అధ్యక్షులు సానికొమ్ము వెంకటేశ్వరెడ్డి, గొట్లగట్టు సర్పంచ్‌ పెరికె సుఖ్‌దేవ్‌, కుందూరు కాశిరెడ్డి, సిద్దవరం మాజీ సర్పంచ్‌ కిలారి బొంతయ్య, ఏపీవో బులెన్‌రావు, వైద్యాధికారులు బాలయ్య, సురేఖ, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేయండి : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌ : ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో నేరుగా ఎమ్మెల్యేకు అందచేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పింఛన్‌లు, రేషన్‌కార్డులు, తాగు, సాగు నీరు భూ వివాదాలపై అర్జీలు అందినట్లు చెప్పారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Feb 02 , 2026 | 11:32 PM