Share News

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:00 AM

వేసవికాలం సమీపిస్తుండడంతో తాగునీటి ఎద్దడి నివారణకు గిద్దలూరు మున్సిపాలిటీ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
సామగ్రిని పరిశీలిస్తున్న కమిషనర్‌ రమణబాబు

రూ.30.51 లక్షలతో మోటార్ల కొనుగోలు

వేసవి దృష్ట్యా అప్రమత్తమైన గిద్దలూరు మునిసిపాలిటీ

గిద్దలూరు టౌన్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : వేసవికాలం సమీపిస్తుండడంతో తాగునీటి ఎద్దడి నివారణకు గిద్దలూరు మున్సిపాలిటీ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రజలకు నిరంతర నీటి సరఫరా చేయాలని పలు సందర్భాలలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అధికార యంత్రాంగానికి సూచిస్తుండడంతో మున్సిపాలిటీ పరిధిలోని బోర్‌వెల్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు సమర్థవంతంగా పనిచేసేందుకు 39 మోటార్లను రూ.30.51 లక్షలతో కొనుగోలు చేశారు. ఇందులో 5.0 హెచ్‌పీ సామర్థ్యంతో 2 మోటార్లు, 3.0 హెచ్‌పీ సామర్థ్యంతో ఒక మోటారు ఉన్నాయి. ఈ మోటార్లను అవసరమైన ప్రాంతాలలో తక్షణమే అమర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్‌ కార్యాలయానికి కొనుగోలు చేసిన మోటార్లను కమిషనర్‌ రమణబాబు, సిబ్బంది పరిశీలించారు. మరమ్మతులకు గురైన ప్రాంతాలతోపాటు కాలిపోయిన వాటిస్థానంలో కొత్త మోటార్లను వాటిని 24 గంటల్లో ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ రమణబాబు స్పష్టం చేశారు. .

Updated Date - Feb 28 , 2026 | 12:00 AM