సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:20 PM
సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు
హజ్ యాత్రికుల అవగాహన కార్యక్రమంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్దన్
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్రికులకు జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ మైనార్టీసెల్ రాష్ట్ర నాయకులు పఠాన్ హనీ్‌ఫఖాన్ అధ్యక్షత వహించగా, ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు ఓడా చైర్మన్ షేక్ రియాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ. లక్ష అందజేస్తుందన్నారు. ముస్లింల సంక్షేమంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 60 మంది వెళుతుండగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ మౌలానాఅబిద్ పాల్గొన్నారు.