దివ్యాంగులకు శక్తి
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:22 AM
దివ్యాంగులకు ఉగాది కానుకగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో బుధవారం ప్రారంభమైంది. పలుప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోలు, బస్‌స్టేషన్ల వద్ద కీలక ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కోలాహలంగా ప్రారంభమైన కార్యక్రమం
ఒంగోలులో ఎంపీ మాగుంట,
కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బీఎన్ హాజరు
ఇతరచోట్ల ఎమ్మెల్యేలు, నేతలచే ప్రారంభం
దివ్యాంగులతో కలిసి ప్రయాణం
ఒంగోలు, మార్చి 18 (ఆంఽధ్రజ్యోతి) : దివ్యాంగులకు ఉగాది కానుకగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో బుధవారం ప్రారంభమైంది. పలుప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోలు, బస్‌స్టేషన్ల వద్ద కీలక ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్దసంఖ్యలో పాల్గొన్న దివ్యాంగులు, టీడీపీ శ్రేణులతో కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. దివ్యాంగులతో కలిసి అధికారులు, నేతలు కొంతదూరం బస్సుల్లో ప్రయాణించారు. జిల్లా పరిధిలో 27 మండలాల్లో ఇప్పటికే 21,909 మంది దివ్యాంగులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ ఒంగోలులోని ఆర్టీసీ డిపో వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత సభ నిర్వహించిన వారు అనంతరం దివ్యాంగులతో కలిసి బస్సుల్లో కొద్దిదూరం వెళ్లారు. ఎంపీ మాగుంట కొత్తపట్నం రూట్‌లోనూ, ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ ఎస్‌ఎన్‌పాడు రూట్‌లోనూ, కలెక్టర్ రాజాబాబు టంగుటూరు రూట్‌లోనూ ప్రయాణించారు. కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. దర్శి బస్సు స్టేషన్ వద్ద ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు.