Share News

సానుకూలత తగ్గింది

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:10 AM

ప్రభుత్వం ద్వారా వివిధ వర్గాలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం గతం కన్నా తగ్గింది. కొన్ని కీలక శాఖల్లో ఇది గణనీయంగా పడిపోయింది. ఆయా అంశాలపై ప్రజల సంతృప్తిస్థాయి రాష్ట్రంలోని వివిధ జిల్లాల సగటు ప్రకారం పరిశీలిస్తే... ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాలు చివరి స్థానాల్లోకి వెళ్లాయి.

సానుకూలత తగ్గింది
సదస్సుకు హాజరైన మార్కాపురం, ప్రకాశం కలెక్టర్‌లు విజయసునీత, రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

కీలక శాఖల తీరుపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి

మొత్తం అంశాలపై ప్రకాశంలో 29.80శాతం,

మార్కాపురంలో 31.30శాతం అసంతృప్తి

రాష్ట్రంలో సంతృప్తి స్థాయిలో 22వ,

27వ స్థానాలకు చేరిన రెండు జిల్లాలు

కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ప్రభుత్వం

సంతృప్తి 80శాతానికి తగ్గరాదని సీఎం ఆదేశం

రెండో రోజు పలు ముఖ్యమైన అంశాలపై

చంద్రబాబునాయుడు దిశానిర్దేశం

ఒంగోలులో చెత్త నుంచి సంపద సృష్టిపై

ప్రజెంటేషన్‌ ఇచ్చిన కలెక్టర్‌ రాజాబాబు

ప్రభుత్వం ద్వారా వివిధ వర్గాలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం గతం కన్నా తగ్గింది. కొన్ని కీలక శాఖల్లో ఇది గణనీయంగా పడిపోయింది. ఆయా అంశాలపై ప్రజల సంతృప్తిస్థాయి రాష్ట్రంలోని వివిధ జిల్లాల సగటు ప్రకారం పరిశీలిస్తే... ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాలు చివరి స్థానాల్లోకి వెళ్లాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో మార్కాపురం 31.30శాతం అసంతృప్తితో 27వ స్థానంలో ఉండగా, 29.80శాతం అసంతృప్తితో ప్రకాశం 22వ స్థానంలో ఉంది. శుక్రవారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక శాఖలకు సంబంధించిన అంశాలలో గతం కన్నా పదిశాతం వ్యతిరేకత పెరిగింది.

ఒంగోలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి తగ్గిపోయింది. గత కలెక్టర్ల సదస్సు నాటికి ప్రకాశంలో ప్రజల సంతృప్తి 71.80శా తం ఉండగా ప్రస్తుతం అది 1.60శాతం తగ్గి 70.20శాతానికి పరిమితమైంది. మార్కాపురం జిల్లాలో గతంలో 69.70శాతం ఉండగా ఒక శాతం తగ్గి ప్రస్తుతం 68.70 శాతానికి పడిపో యింది. అమరావతిలోని సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండోరోజైన శుక్రవారం విద్య, వైద్యం, సంక్షేమం, శాంతిభ ద్రతలు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, విద్యు త్‌ వంటి కీలకశాఖలతోపాటు ప్రజావినతుల పరిష్కారం, ఆర్టీజీఎస్‌, పాలనలో సాంకేతిక వినియోగం, పైళ్ల పరిష్కారం, ఆయా అంశా లపై ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయ సేక రణ తదితర విషయాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కాగా ఈ సమీక్షలో పథకాల అమలు, పౌరులకు అందుతున్న వివిధ రకాల సేవలు, జిల్లాల్లో పాలనా తీరుపై ప్రజాభిప్రాయాల నివేదికలను ప్రభుత్వం ప్రకటించింది. వాటిపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. పరిస్థితి మెరుగుపడాలని, ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగడమే అంతిమంగా అందరి లక్ష్యం కావాలని ఆదేశించారు.

పెరుగుతున్న అసంతృప్తి

గత కలెక్టర్‌ల సదస్సు నాటికి, ప్రస్తుతానికి ప్రజాభిప్రాయాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కొన్ని కీలక అంశాలపై విడివిడిగా ప్రభుత్వం ప్రక టించింది. ఆ ప్రకారం చూస్తే.. గత కలెక్టర్ల సమావేశం నాటికి 46 అంశాలపై ప్రజాభిప్రాయాన్ని తీసుకోగా ఈసారి 54 అంశాలపై తీసుకొని క్రోడీకరించారు. గత సమావేశం నాటికి రాష్ట్రంలో అన్ని అంశాలపై కలిసి సగటున 73.50శాతం ప్రజలు సానుకూలంగా ఉండగా ప్రస్తుతం 72.30శాతం మంది ఉన్నట్లు ప్రకటించారు. ఇక జిల్లాల వారీగా విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో గత సమావేశం నాటికి 71.80శాతంగా ఉన్న ప్రజల సంతృప్తి ప్రస్తుతం 70.20 శాతానికి తగ్గింది. తాజాగా ప్రకాశంలో 29.80శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.

కీలక అంశాలలో వెనకడుగు

కీలక అంశాలను పరిశీలిస్తే గత సమావేశం నాటికి ఫైర్‌ సర్వీసెస్‌లో నూరుశాతం సంతృప్తి ఉండగా ప్రస్తుతం అందులో 11.10శాతం తగ్గింది. కాలేజీ విద్యలో 11.10శాతం, దీపం-2 పథకం అమలులో 10.80శాతం, తాగునీరు-వీధి దీపాల విభాగంలో 10.10శాతం, గంజాయి నిషేధంలో 7.60శాతం, విద్యుత్‌ సేవల్లో 7.30శాతం, పాఠశాల విద్యలో 6.90 శాతం స్వచ్ఛాంధ్రలో 6.9శాతం బీసీ హాస్టళ్ల నిర్వహణపై 5.9శాతం గతం కన్నా సంతృప్తి తగ్గింది. మహిళలపై వేధింపులు, వైద్యసేవలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సేవలు, అన్న క్యాంటీన్లు, రవాణా శాఖ సేవలు, పింఛన్‌ల పంపిణీ తదితరాల పట్ల కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. భూసంబంధమైన మ్యుటేషన్లు, పర్యావరణ అనుమతులు, ఆర్టీసీ, హౌసింగ్‌, రోడ్ల మరమ్మతులు, పంచాయతీల్లో సేవల పట్ల సంతృప్తి పెరిగింది. రెవెన్యూకు సంబంధించి మ్యుటేషన్లు విషయంలో ఏకంగా గతం కన్నా 10శాతం మందిపైగా సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

మార్కాపురం జిల్లాలోనూ అంతే

మార్కాపురం జిల్లాను పరిశీలిస్తే గత సమావేశం నాటికి 69.70శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేయగా ప్రస్తుతం అది మరో శాతం తగ్గి 68.70శాతానికి పరిమితమైంది. అంటే 31.30శాతం మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఆయా కీలక అంశాలను పరిశీలిస్తే భూముల సర్వేకు సంబంధించి ఎఫ్‌-లైన్‌ సర్వేపై గతం కన్నా పెరిగింది. రవాణా శాఖపై 8శాతం, దీపం-2 పట్ల 7.30 శాతం, బీసీ వసతి గృహాల నిర్వహణపై 7.20శాతం, కాలేజీ విద్యకు సంబంధించి 6.20శాతం, వీధి దీపాలు-తాగునీటి సరఫరాపై 5.50శాతం, గంజాయి నియంత్రణ చర్యలపై 5.5శాతం అసంతృప్తి పెరిగింది. అలాగే హాస్టల్‌ సర్వీసులు, అన్న క్యాంటీన్లు, విద్యుత్‌, రెవెన్యూ మ్యుటేషన్లు, మహిళలపై వేధింపులు, పెన్షన్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం వంటి వాటిపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరగ్గా పంచాయతీ శాఖ, ఇసుక విధానం, రీసర్వే, హౌసింగ్‌, రేషన్‌ పంపిణీ, రోడ్ల నిర్వహణ తదితర రంగాల్లో 4 నుంచి 10 శాతం సంతృప్తి పెరిగింది.

వచ్చేసారికి 80శాతానికి చేరాలి

ప్రజల్లో సంతృప్తి పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని, వచ్చే సమావేశం నాటికి అది 80శాతం ప్రజల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. అలాగే పైళ్ల క్లియరెన్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాంకేతిక వినియోగంతోపాటు ప్రజల మధ్యకు వెళ్లడం, సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ముఖ్యమని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలపై సీఎం పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వగా ఈసారి సమావేశంలో వివిధ ప్రత్యేక అంశాలపై ఆరు జిల్లాల కలెక్టర్లకు ప్రజెంటేషన్‌ ఇచ్చే అవకాశం కల్పించారు. అందులో డ్రోన్‌ ప్రాజెక్టులపై ఏఎస్‌ఆర్‌ జిల్లా, స్కూళ్లలో మార్పులపై అనంతపురం, స్వర్ణ భవిత కార్యక్రమంపై బాపట్ల, డిజిటల్‌ స్కూళ్లపై చిత్తూరు, వేస్టు టూ వెల్త్‌- సర్క్యులర్‌ ఎకనామీ అంశంపై మన కలెక్టర్‌ రాజాబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

చెత్త నుంచి సంపద తయారీ

చెత్త నుంచి సంపద తయారీకి తీసుకున్న చర్యలు, తద్వారా ఒంగోలు కార్పొరేషన్‌కు ఆదాయ సముపార్జన అంశాలను కలెక్టర్‌ రాజాబాబు సదస్సులో వివరించారు. కాగా సాయంత్రం శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు రెండు జిల్లాల తరఫున పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం తరఫున జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు రెండు జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, విజయసునీత హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు జిల్లాల కేంద్రాలైన ఒంగోలు, మార్కాపురం నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 03:10 AM