కందుకూరులో కుట్ర రాజకీయం
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:52 AM
కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికల విషయంలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంగా ఉన్న కోర్టు కేసును ఉపసంహరించుకుంటే ఉపయోగమని టీడీపీ భావిస్తుంటే ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసేందుకు వైసీపీలోని ఒకరిద్దరు సీనియర్ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణ అవకాశాలను
దెబ్బతీసేందుకు వైసీపీ యత్నం
అదే జరిగితే కేంద్రం నిధులు రానట్టే
మునిసిపాలిటీలో అభివృద్ధికి గండిపడటం ఖాయం
లక్షన్‌కురాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు
వాయిదాపడిన కీలకమైన కోర్టు తీర్పు
కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికల విషయంలో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంగా ఉన్న కోర్టు కేసును ఉపసంహరించుకుంటే ఉపయోగమని టీడీపీ భావిస్తుంటే ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసేందుకు వైసీపీలోని ఒకరిద్దరు సీనియర్ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఎన్నికల నిర్వహణ ఎమ్మెల్యేకు ఇష్టం లేదన్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ కుట్ర రాజకీయాలు ఎలాగున్నా మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగి పాలకవర్గం ఏర్పడకపోతే పట్టణాభివృద్ధికి భారీగా గండి పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్ట్రప్రభుత్వం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో అందుకు ఎమ్మెల్యే సామ,దాన,భేద దండోపాయాలను ప్రయోగించే ప్రయత్నాలను ప్రారంభించారు.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబరులో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగా కార్పొరేషన్ మేయర్, మునిసిపల్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అక్టోబరులో ప్రక్రి యను ప్రారంభించి వీలైనంత వేగంగా ముగిస్తే తప్ప కేంద్రప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు రావని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ప్రకటిం చారు. ఈనేపథ్యంలో ముందుగా మునిసిపాలి టీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని వివిధ రకాల కోర్టు కేసులతో దశాబ్దకాలంగా ఎన్నికలు జరగని 23 మునిసిపాలి టీలకు కూడా ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి.. ప్రత్యే కించి మునిసిపల్ శాఖ మంత్రి, ఉన్నతాధికారు లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కందుకూరు మునిసిపాలిటీకి కోర్టు కేసును పరిష్కరించుకొని ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రభుత్వం భావిం చింది. ఆమేరకు అవసరమైన చర్యలు తీసుకోవా లని స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ఇటు ముఖ్యమంత్రి, అటు మంత్రి నారాయణ ఆదేశించారు.
పిటిషనర్ సానుకూలమే.. కానీ
కందుకూరు మునిసిపాలిటీ విషయంలో కోర్టు కేసు పరిష్కారానికి కోర్టు కేసు పరిష్కారానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు చర్చలు ప్రారంభించగా ప్రధాన ప్రత్యర్థి పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు ఆ ప్రయత్నానికి గండికొట్టే చర్యలను ప్రారంభించారు. ఎన్నికలకు అడ్డంగా కోర్టులో ఉన్న పిటిషన్‌ను మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి వేశారు. ఆయన కేసు ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపితే అడ్డంగి తొలగిపోతుంది. దీంతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచనతో టీడీపీకి చెందిన కొందరు దాసరి మాల్యాద్రితో చర్చించారు. ఆయన నుంచి సానుకూల స్పందన రావడంతో ఆ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఆ తర్వాత నాగేశ్వరరావు సదరు మాల్యాద్రి పిటిషన్‌ను ఉపసంహరించుకున్నా, లేకున్నా తదనుగుణంగా కొన్ని గ్రామాల పొడిగింపు జరిగినా, జరగకపోయినా తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తద్వారా ప్రత్యర్థి పక్షాన్ని ఎన్నికల బరిలోకి రావాలని సవాల్ విసిరారు. ఆ తర్వాతే కందుకూరులో తెరచాటు రాజకీయాలు మొదలయ్యాయి. అధికారపార్టీ చెప్పినా కేసు ఉపసంహరించుకోవద్దని మాల్యాద్రికి కొందరు వైసీపీ నాయకులు చెప్పి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసినట్లు తెలిసింది. దీంతో కేసు ఉపసంహరణకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న సంశయం ఆరంభమైంది.
ఇదీ కోర్టు కేసు నేపథ్యం..
కందుకూరు మునిసిపాలిటీ 1987 ఏర్పడింది. అప్పట్లో ఎనిమిది గ్రామాలను విలీనం చేశారు. అయితే 1997లో అప్పటి ఎమ్మెల్యే దివి శివరాం సహకారంతో మహదేవపురంను మునిసిపాలిటీ నుంచి తొలగించారు. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2005లో మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో దూబగుంట, వెంకటాద్రిపాలెం గ్రామాలను ఉంచి మిగిలిన ఐదు గ్రామాలను మునిసిపాలిటీ నుంచి తొలగించారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మహీధర్‌రెడ్డి సహకారంతో వాటి తొలగింపు జరిగింది. అయితే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అప్రజాస్వామిక విధానంలో మునిసిపాలిటీ నుంచి తమ గ్రామాలను తొలగించారంటూ ఆ గ్రామాల ప్రజలు కోర్టుకు వెళ్లారు. వారిని తెలుగుదేశం పార్టీ వర్గీయులే ప్రోత్సహించి కోర్టుకు పంపారు. 2016లో కోర్టు ఆ కేసు విషయంలో తీర్పునిచ్చింది. మునిసిపాలిటీ నుంచి ఆ గ్రామాల తొలగింపు చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని వ్యాఖ్యానిస్తూ వాటిని తిరిగి మునిసిపాలిటీలో విలీనం చేయాలని ఆ తీర్పులో పేర్కొంది. దీంతో తిరిగి ఆ గ్రామాలు మునిసిపాలిటీలో చేరాయి. ఆ వెంటనే వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి ప్రోత్సాహంతో మాల్యాద్రి పిటిషన్ వేసినట్లు ప్రచారం జరిగింది. ఆ కేసు విచారణలో ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2021లో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కోర్టులో కేసు ఉందన్న సాకుతో కందుకూరుకు ఎన్నికలు నిర్వహించకుండా నిలిపివేశారు. అప్పటి నుంచి మునిసిపాలిటీకి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. కారణాలు ఏమైనా గత వైసీపీ ప్రభుత్వంలో మునిసిపాలిటీలో అభివృద్ధి పనుల అంతంతమాత్రంగానే జరిగాయి.
పాలక మండలి ఏర్పడకపోతే నిధులు రానట్లే!
కందుకూరు మునిసిపాలిటీకి ఇప్పుడైనా ఎన్నికలు జరిగి పాలకమండలి ఏర్పడకపోతే ఆర్థికసంఘం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి ముఖ్య మంత్రి చంద్రబాబు కందుకూరు వచ్చినప్పుడు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరిక మేరకు పట్టణా భివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించారు. వాటి ద్వారా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఇదే సమయంలో ఎన్నికలు జరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తే పట్టణాభివృద్ధి మరింత పరుగులు తీసే అవకాశం ఉంది. మరి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా వైసీపీ నాయకులు తమ కుట్ర రాజకీయాలకు తెరదించి ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో అలా ఆగిపోయిన 23 మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ మంగళవారం వాయిదా పడింది. త్వరలో మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.