బాణసంచా తయారీపై పోలీసుల దృష్టి
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:39 AM
టపాసుల క్రయవిక్రయ దుకాణదారులు నిబంధనలు పాటించాలని డీఎస్పీ ఎండీ మొయిన్ చెప్పారు.
ఈపూరుపాలెం(చీరాల), మార్చి 1 (ఆంరఽధజ్యోతి) : టపాసుల క్రయవిక్రయ దుకాణదారులు నిబంధనలు పాటించాలని డీఎస్పీ ఎండీ మొయిన్ చెప్పారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో జిల్లాలో పోలీసులు అప్రమత ్తమయ్యారు. ఈక్రమంలోనే ఆదివారం డీఎస్పీ చీరాల పరిధిలోని పలు క్రాకర్స్ గోడౌన్‌లలో సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్‌లతో కలిసి తనిఖీలు నిర్వహించారు. దుకాణాదారుల లైసెన్స్‌లు, అలాగే ప్రమాద నియంత్రణకు తీసుకున్న జాగ్రత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు, తయారీదారులు కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిం చారు. టపాసు నిల్వలు, తయారీలపై దిశా నిర్దేశాలు చేశారు.
స్వర్ణ(పర్చూరు) : కాకినాడ జిల్లా, వేట్లపాలెంలో బాణసంచా కేంద్రంలో జరిగిన పేళ్లుపై పోలీసులు అప్రమత్తం అయ్యారు. మండలంలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీ చేశారు. అందులో భాగంగా కారంచేడు మండలం స్వర్ణ గ్రామం లోని బాణసంచా తయారీ కేంద్రాన్ని శనివారం చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఇంకొల్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వైవీ.రమణయ్య ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి, లైసెన్స్‌ను పరిశీలించారు. అయితే ప్రస్తుతం ఎలాంటి బాణసంచా మందులను తయారు చేయటం లేదని నిర్వహకులు తెలిపారు. కేంద్రంలో ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టాలని తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సై ఖాదర్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.