జల్లెడపడుతున్న పోలీసులు
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:03 AM
మున్సిపోల్స్ ప్రచారపర్వం ముగియడంతో ఎన్నికలు జరుగుతున్న ఒంగోలు, చీమకుర్తి, అద్దంకి ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటు లేని వారు ఎక్కడైనా మకాం వేశారా? అన్న కోణంలో లాడ్జిలలో సోదాలు చేశారు.
పట్టణాల్లో విస్తృత తనిఖీలు
అత్యంత సమస్యాత్మక ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా
ఒంగోలు క్రైం, అక్టోబరు 30 (ఆంధ్ర జ్యోతి) : మున్సిపోల్స్ ప్రచారపర్వం ముగియడంతో ఎన్నికలు జరుగుతున్న ఒంగోలు, చీమకుర్తి, అద్దంకి ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటు లేని వారు ఎక్కడైనా మకాం వేశారా? అన్న కోణంలో లాడ్జిలలో సోదాలు చేశారు. మద్యం నిల్వలపై దృష్టి సారించారు. నగదు పంపిణీ చేస్తున్న వారిపై నిఘా ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిం చేందుకు వీలుగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు చీమకుర్తి, అద్దంకి మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 104 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలు 19 కాగా, సమస్యాత్మకమైనవి 32 ఉన్నాయి. అయా ప్రాంతాలలో 33 మొబైల్ రూట్‌లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఇప్పటికే లాడ్జిలలో సోదాలతోపాటు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. చీమకుర్తిలో నగదు పంపిణీ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇంకా మద్యం అక్రమ నిల్వలపై పోలీసులు దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు.