పైర్లను వెంటాడుతున్న తెగుళ్లు
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:32 PM
ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడద అన్నదాతలను కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
పర్చూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడద అన్నదాతలను కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. తెగుళ్ల ను అరికట్టేందుకు విచ్చలవిడిగా మందులు పిచికారి చేస్తుండటంతో పెట్టుబడి భారంగా మారి రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటు న్నారు. పంటసాగు సమయంలో ధర ఊరిం చడంతో ఈ ఏడాది మిరప సాగు వైపు రైతులు మొగ్గుచూపారు. తీరా మొక్కలు నాటాక ధర నేల చూపు చూస్తోది. సాగు చేసుకున్న పైర్లను ఏదో విధంగా కాపాడుకు నేందుకు అహర్నిశలు శ్రమి స్తున్నా ఫలితం కానరా వడంలేదు. మిర్చి పైరులో బొబ్బర (జమినీ) తెగులతో పాటు, నల్లతామర సమస్య తీవ్రం కావడంతో మొక్కలు ముడుచుకుపోయి ఎదుగు దల కోల్పోతున్నాయి. తామ ర పురుగును అరికట్టేం దుకు విడతకు రూ.4-5వేల చొప్పున మూడు నుండి నాలుగు రోజులకో మారు మందులు పిచికారి చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మందులు చల్లుతున్నా పూర్తి స్థాయి లో అరికట్టలేక అన్నదాతలు అవస్ధలు పడుతున్నారు. మరోవైపు పెట్టుబడి భారం పెరిగిపోవడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో సాగుచేసుకున్న మినుము, పెసర పరిస్థితి ఇంతకన్నా దయ నీయంగా ఉంది. తామర, ఎర్రనల్లి ఆశించడంతో పంటను రక్షించుకు నేందుకు నెలకు 5 నుండి 6 సార్లు మందు లను పిచికారి చేస్తున్నారు. గతంలో ఈ పైర్లు సాగు చేసుకొని పంట చేతికి వచ్చే సమయానికి 3 - 4 సార్లు మించి క్రిమిసంహారక మందులను సాగుచేసిన దాఖలాలు లేవని రైతులు అంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది తెగుళ్ల తీవ్రత అధికంగా ఉందని ఏమిచేయాలో పాలుపోవటం లేదని రైతులు అంటున్నారు. పర్చూరు మండల పరిధిలోని పోతుకట్ల, అడుసుల్లి, దేవరపల్లి, తిక్కరాజు పాలెం తదితర గ్రామాల్లో తెగుళ్ల తీవ్రత తట్టుకోలేక పెసరపైర్లను దున్నుకొని ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.