Share News

శింగరకొండలో రాజగోపురాల పునఃనిర్మాణానికి అనుమతి

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:14 PM

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 7 కోట్ల రూపాయలతో రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తి కాగా, కొత్తగా మరో 20కోట్ల రూపాయలతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించనున్నారు.

శింగరకొండలో రాజగోపురాల పునఃనిర్మాణానికి అనుమతి
ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం

రూ.20 కోట్లతో వాటి నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలు

అద్దంకి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి) : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 7 కోట్ల రూపాయలతో రాతి ముఖ మండపం నిర్మాణం పూర్తి కాగా, కొత్తగా మరో 20కోట్ల రూపాయలతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. వీటి నిర్మాణానికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసేందుకు దేవదాయ కమిషనర్‌ బుధవారం అనుమతులు ఇచ్చినట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈవో తిమ్మానాయుడు తెలిపారు. అంచనాలు రూపొందించిన అనంతరం రాజగోపురాలు, ప్రాకారం న మూనా సిద్ధం చేసి ఉన్నతాధికారుల అనుమతి పొందుతామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే వాటి నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే 2 కోట్ల రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు తీసుకున్నామని, దాతలు ముందుకు వచ్చిన వెంటనే పనులు చేపడతామని తెలిపారు. గోశాల నిర్మాణ పనులు కూడా చేపట్టామన్నారు. కొండపై పెద్ద ఎత్తున మొక్కలు పెంపకం చేపట్టేందుకు డ్వామా సహకారంతో వర్షాకాలం ప్రారంభమైన వెంటనే డ్రోన్ల సహాయంతో విత్తనాలు చల్లించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:14 PM