Share News

లోవోల్టేజీకి శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:17 PM

కొత్తగా నిర్మించే విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో లోఓల్టేజీ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి మండలంలోని మురుగుమ్మిలో 4కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన సబ్‌స్టేషన్‌కు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు.

లోవోల్టేజీకి శాశ్వత పరిష్కారం
మురుగుమ్మిలో సబ్‌స్టేషన్‌ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు ఉగ్ర, అశోక్‌రెడ్డి

6వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 250 కొత్త సబ్‌స్టేషన్‌లు

ఎమ్మెల్యే ఉగ్రతో కలిసి మురుగుమ్మిలో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి గొట్టిపాటి

దివాకరపల్లిలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష

పీసీపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కొత్తగా నిర్మించే విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో లోఓల్టేజీ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి మండలంలోని మురుగుమ్మిలో 4కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన సబ్‌స్టేషన్‌కు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ ఉత్పాదన చేయకుండా ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద కొని రాష్ట్ర ఖజానాపై భారం మోపారన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కృష్ణపట్నం రాయలసీమ థర్మల్‌ పవర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని పెంచి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 6వేల కోట్ల రూపాయలతో 250 కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. పునరుత్పాదకశక్తి వనరుల వినియోగంతో విద్యుత్‌ ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కనిగిరి నియోజకవర్గంలో 90కోట్ల రూపాయలతో కొత్త విద్యుత్‌ స్తంభాలను వేసినట్లు చెప్పారు.

మండలంలోని దివాకరపల్లిలో నిర్మిస్తున్న రిలయన్స్‌ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను మంత్రి రవికుమార్‌ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన కంపెనీ ప్రతినిధులతో సమీక్షించి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించారు. ప్లాంట్‌ నిర్మాణదశలను మ్యాప్‌ ద్వారా మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఉగ్రలకు కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరం 6కోట్ల రూపాయలతో నిర్మించిన లక్ష్మక్కపల్లి-మాలకొండ రోడ్డును కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్‌, విద్యుత్‌ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, రిలయన్స్‌ కంపెనీ ప్రతినిధి ఫణీంధర్‌, కనిగిరి ఏఎంసీ చైర్మన్‌ యారవ రమాశ్రీనివాస్‌, ఈఈ ఉమాకాంత్‌, తహశీల్దార్‌ ఉషా, ఎంపీడీవో క్రిష్ణారావు, నేతలు రామయ్య, పరిమి ఈశ్వరయ్య, బాలసుబ్బయ్య, పిచ్చిరెడ్డి, కసిరెడ్డి హనుమారెడ్డి, ఓబుల్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, నాగరాజు, శ్రీనివాసులు, పెద్దన్న, ప్రతా్‌పరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:17 PM