ప్రజల వినతులను వెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - May 19 , 2026 | 03:14 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో అందిన వినతులను నిర్దేశిత గడువులోపు పరిష్క రించాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని మీకోసం హాలులో సోమవారం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు.
ఫిర్యాదులు పునరావృతం కాకూడదు
అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో అందిన వినతులను నిర్దేశిత గడువులోపు పరిష్క రించాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని మీకోసం హాలులో సోమవారం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యలపై కలెక్టర్‌మాట్లాడుతూ.. మీకోసంలో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికా రులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. ఏదైనా కారణంతో ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు కారణాలను అర్జీదారునికి అర్థమయ్యేలా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపరాదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యా దులు పునరావృతం కాకుడదన్నారు. ఒకవేళ ఏదైనా అర్జీ రీ ఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 257 వినతులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కళావతి, విజయజ్యోతి, డీపీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో మాచవరం రహదారి వెంబడి ఉన్న నాగన్న వాగును ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నాగన్న వాగు పరిరక్షణ సమితి నాయకులు కలెక్టర్‌ను కోరారు. గ్రామానికి దక్షిణంవైపు నుంచి ఉత్తరం వైపుగా ప్రవహించే నాగన్న వాగు వెంబడి భూములను రియల్ వ్యాపారులు కొనుగోలు చేసి ఎదురుగా ఉన్న వాగును ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ భూములకు కొంతమంది అక్రమంగా పట్టాలు పుట్టించి ఆక్రమించుకుంటున్నారని ఎన్‌జీపాడు మండలం కనపర్తికి చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 1,470 సర్వేనెంబరులోని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భూమి, చెరువులు, వాగులు, శ్మశాన స్థలాలను కూడా ఆక్రమించుకోని కోట్లు గడిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ పట్టాలపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు.