చిరుత సంచారంతో జనం బెంబేలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 10:54 PM
సీఎస్‌పురం మండలంలోని పెద గోగులపల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చిరుతపులి సంచరించింది.
సీఎస్‌పురం (పామూరు), ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : సీఎస్‌పురం మండలంలోని పెద గోగులపల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చిరుతపులి సంచరించింది. గ్రీన్‌ఫీల్డ్ హైవే సమీపంలో తెల్లవారుజాయున 4 గంటల సమయంలో నీటి కోసం చిరుత పులి సంచరించినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని అటవీశాఖ ఎప్‌ఎస్‌వో శేషుబాబు తెలిపారు. చిరుత పులి సంచరించే సమయంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు చేస్తున్న కార్మికులు తమ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసినట్లు తెలిపారు. సమీప పొలాల్లో చిరతపులి అడుగులను గుర్తించినట్లు తెలిపారు. నాగిరెడ్డిపల్లి బీట్ పరిధిలో చిరుత పులుల సంచారం ఉందని నీటి కొరత ఉండటంతో దాహార్తి తీర్చుకొనేందుకు బయటకు వస్తున్నయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ తరుపున హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.