Share News

ధరణి కేంద్రం వద్ద బారులుదీరిన జనం

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:12 PM

పేద, మధ్య తరగతి ప్రజల కోసం తక్కువ ఽధరకే బియ్యం అందజేయటమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశ్యం అని మున్సిపల్‌ చైర్మన్‌ కాకాని అశోక్‌ చెప్పారు. అద్దంకి పట్టణంలోని నంబూరిపాలెంలో ఉన్న నాగులపాడు సొసైటీ కార్యాలయంలో ధరణి కేంద్రాన్ని సోమవారం మున్సిపల్‌ చైౖర్మన్‌ కాకాని అశోక్‌, సొసైటీ అధ్యక్షుడు ఏనుగంటి వెంకటరామయ్య(బాబు)లు ప్రారంభించారు.

ధరణి కేంద్రం వద్ద బారులుదీరిన జనం
బియ్యం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు

అద్దంకి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి) : పేద, మధ్య తరగతి ప్రజల కోసం తక్కువ ఽధరకే బియ్యం అందజేయటమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశ్యం అని మున్సిపల్‌ చైర్మన్‌ కాకాని అశోక్‌ చెప్పారు. అద్దంకి పట్టణంలోని నంబూరిపాలెంలో ఉన్న నాగులపాడు సొసైటీ కార్యాలయంలో ధరణి కేంద్రాన్ని సోమవారం మున్సిపల్‌ చైౖర్మన్‌ కాకాని అశోక్‌, సొసైటీ అధ్యక్షుడు ఏనుగంటి వెంకటరామయ్య(బాబు)లు ప్రారంభించారు. 26 కిలోల బియ్యం బస్తాను రూ.1300లకు అమ్మకాలు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 200 బస్తాల తెప్పించగా మధ్యాహ్నానికి అయిపోయాయి. దీంతో మళ్లీ మరో 160 బస్తాలను తెప్పించారు. ధరణి కేంద్రం వద్ద ప్రజలు బారులుదీరారు. సాయంత్రానికి మొత్తం 300 బస్తాలు అమ్మకాలు జరిగాయి. తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి ఒక్కో బస్తా బియ్యం చొప్పున అమ్ముతామని సొసైటీ అద్యక్షుడు బాబు తెలిపారు. ఆధార్‌కార్డు ఆధారంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ సందిరెడ్డి రమేష్‌, సొసైటీ సీఈవో శివరామకృష్ణ పాల్గొన్నారు.

పేదలకు సన్న బియ్యం

దర్శి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి) : ధరణీ పథకం కింద పేదలకు తక్కువ ధరలకు సోమవారం సన్న బియ్యం పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా బియ్యం ధరలు పెరగటంతో ప్రజా ప్రభుత్వం ఈ పథకం ద్వారా సరసమైన ధరలకు బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చొరవతో దర్శిలో సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. 26 కేజీల బస్తా రూ.1100 విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు బొగ్గవరపు సుబ్బారావు, అచ్యుతప్రకాష్‌ తెలిపారు.

Updated Date - Nov 16 , 2026 | 11:12 PM