Share News

వృద్ధుల మేలుకోరే ఇంటింటికీ పింఛన్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:31 PM

వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి మేలుకోరే ప్రభు త్వం ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ను అందజేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మండలం కంభం అర్బన్‌ కాలనీలో ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ భరో సా పెన్ష న్లు ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.

వృద్ధుల మేలుకోరే ఇంటింటికీ పింఛన్‌

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి మేలుకోరే ప్రభు త్వం ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ను అందజేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మండలం కంభం అర్బన్‌ కాలనీలో ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ భరో సా పెన్ష న్లు ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమయానికి అందిస్తున్నట్లు చెప్పారు. 1వ తేదీ ఆదివారం వస్తే ఒక రోజు ముందుగానే పింఛన్‌ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎన్నారై రఫి, నూరుల్లా ఖాద్రి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు బిజ్జాల కిషోర్‌, జడ్పీటీసీ సభ్యుడు కొత్తపల్లి జ్యోతి, తహసీల్దార్‌ కిరన్‌, ఎంపీడీవో వీరభద్రాచారి, నాయకులు పాల్గొన్నారు.

వృద్ధులకు ఎలాంటి కష్టం రాకుండా

పింఛన్‌ల పంపిణీ : ఎమ్మెల్యే కందుల

పొదిలి : పేదలు, వృద్ధులకు ఎలాంటి కష్టం రాకుండా ఉండాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటికీ పింఛన్‌లను పంపిణీకి చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండల అధ్యక్షుడు దోర్నాల అంజిరెడ్డి అధ్యక్షతన ఉప్పలపాడు పంచాయతీలో గోగినేనివారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పాలనలో జగన్‌రెడ్డి రూ.3వేల పింఛన్‌ ఇస్తామని చెప్పి ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ వృద్ధులను మోసగించారన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌ రూ.4వేలను ప్రతి నెలా 1వ తేదీనే ఇస్తున్నారని, ఆదివారం 1 తేదీ వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్‌ అందజేస్తున్నారని ఎమ్మెల్యే కందుల తెలిపారు. అంతకముందు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారి నుంచి గోగినేనివారిపాలెం గ్రామానికి తారు రోడ్డును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పంచాయతీకి మంజూరైన నూతన ట్రాక్టర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో గుత్తా శోభన్‌బాబు, పంచాయతీ సెక్రెటరీ శేషగిరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, గ్రామ నాయకుడు సోమయ్య, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్‌, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి ఆవులూరి యలమంద, మార్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి పాల్గొన్నారు.

పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యం

ఎన్టీయార్‌ భరోసా పింఛన్‌ల

పంపిణీలో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : పేదవారి కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా క్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎన్టీయార్‌ భరోసా పింఛన్‌ల నగదు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 12వ వార్డులో లబ్ధిదారులకు నగ దు అందచేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పార్టీలకతీతంగా పింఛన్‌లను పారదర్శకంగా అందచేస్తున్నట్లు చెప్పారు. కొంతమంది వైసీపీ మూక పిం ఛన్‌ల పంపిణీలో అధికారులు, సిబ్బంది అవకతవలకు పాల్పడుతున్నట్లు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎంతో బాధ్యతగా పింఛన్‌లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పా రు. కొంతమంది వృద్ధులకు వారు రాలేని ప్రాంతాల్లో ఉంటే వారికి కూడా సిబ్బంది అందజేస్తూ మన్ననలను పొందుతున్నారన్నారు. ఒకవేళ ఎక్కడైనా పింఛన్‌ల పంపిణీలో అవకతవకలు జరిగితే ప్రజలే నేరుగా తన దృష్టికి తేవాలన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 11:32 PM