రేపు పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:54 AM
ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మే ఒకటో తేదీన పింఛన్ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది. ప్రతినెలా ఒకటో తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతు వులు, ఇతర కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న వారికి సొమ్మును ఇంటి వద్దనే ఇస్తున్న విషయం విదితమే. ఏప్రిల్‌కు సంబంధించి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
ప్రకాశంలో 2,18,620 మందికి రూ.95.22 కోట్లు
మార్కాపురంలో 1,41,290 మందికి రూ.63.59 కోట్లు
నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
నేడు బ్యాంకుల నుంచి సచివాలయ సిబ్బంది డ్రా
రేపు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు అందజేత
ఒంగోలు నగరం. ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మే ఒకటో తేదీన పింఛన్ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది. ప్రతినెలా ఒకటో తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతు వులు, ఇతర కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న వారికి సొమ్మును ఇంటి వద్దనే ఇస్తున్న విషయం విదితమే. ఏప్రిల్‌కు సంబంధించి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 2,18,620 మంది సామాజిక పింఛన్లు పొందుతున్న వారు ఉండగా వీరికి పంపిణీ చేసేందుకు రూ.95.22 కోట్లు విడుదల చేసింది. మార్కాపురం జిల్లాలో 1,41,290 మంది లబ్ధిదారులకు రూ.63.59 కోట్లను ఇచ్చింది. ఈ సొమ్మును గురువారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేసి శుక్రవారం పంపిణీ చేయనున్నారు. ఉదయం 6.30 నుంచే ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతరచోట్ల ఉన్న పింఛన్‌దారులకు కూడా ఒకటో తేదీన స్వగ్రామానికి వచ్చి సొమ్మును తీసుకోవాలని కోరుతూ సచివాలయ సిబ్బంది సమాచారం ఇస్తున్నారు. రెండు జిల్లాల్లో పింఛన్ పంపిణీ సజావుగా సాగేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు.