కాంట్రాక్టర్‌లకు పెండింగ్ బిల్లులు మంజూరు
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:41 PM
ఒంగోలు నగరపాలక సంస్థలో వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్‌లకు ప్రజా ప్రభుత్వంశుభవార్త తెలియజేసింది.
ఒంగోలు కార్పొరేషన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థలో వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్‌లకు ప్రజా ప్రభుత్వంశుభవార్త తెలియజేసింది.2025 ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ గురువారం సీఎంఎఫ్ ద్వారా ప్రాసెస్ చేయబడిన రూ.17.61 కోట్లు బిల్లులు కాంట్రాక్టర్‌లబ్యాంకు ఖాతాలో జమయ్యాయి. గత వైసీపీహయాంలో ఐదేళ్లలో చేసిన పలురకాల పనులకు బిల్లులు లేక, కాంట్రాక్టర్‌లు తీవ్ర ఇబ్బందులలో ఉన్న నేపథ్యంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్‌లు హర్షం వ్యక్తం చేశారు.