Share News

నేటి నుంచి శనగల కొనుగోలు

ABN , Publish Date - Feb 22 , 2026 | 10:55 PM

జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం మార్క్‌ఫెడ్‌ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆ సంస్థ మేనేజర్‌ హరికృష్ణ చెప్పారు. శనగలు కొనుగోలు చేసేందుకు జిల్లాలో మొత్తం 20 కేంద్రాలు ఏర్పా టు చేశామన్నారు. సోమవారం కంభం, గిద్దలూరు, మార్కాపురంలో అవి ప్రారంభంకానున్నాయని చెప్పారు.

నేటి నుంచి శనగల కొనుగోలు

20 చోట్ల కేంద్రాల ఏర్పాటు

మొత్తం 29,260 హెక్టార్లలో సాగు

సుమారు 33,300 మెట్రిక్‌ టన్నుల దిగుబడి

ప్రభుత్వ మద్దతు ధర రూ.5,879

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు మొబైల్‌ సందేశం

మార్కాపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శనగల కొనుగోలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందుకోసం మార్క్‌ఫెడ్‌ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆ సంస్థ మేనేజర్‌ హరికృష్ణ చెప్పారు. శనగలు కొనుగోలు చేసేందుకు జిల్లాలో మొత్తం 20 కేంద్రాలు ఏర్పా టు చేశామన్నారు. సోమవారం కంభం, గిద్దలూరు, మార్కాపురంలో అవి ప్రారంభంకానున్నాయని చెప్పారు. ఇప్పటికే వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టారు. అందులో రైతు నమోదు చేసుకున్న సాగు, దిగుబడి వివరాలతో పాటు మొబైల్‌ నెంబరు ఇవ్వాలి. అదే మొబైల్‌కు అతని షెడ్యూల్‌ వివరాలు, కొనుగోలు కేంద్రం వివరాలు వస్తాయి. ఆ రోజు రైతు తన వద్ద ఉన్న సరుకు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 35 మండలాల్లో 29,260 హెక్టార్లలో శనగ సాగుకాగా అం దులో మార్కాపురం జిల్లాలోని 19 మండలాల్లో 14,054 హెక్టార్లలో పంట సాగు చేసినట్టు అధికారులు నివేదిక తయారు చేశారు. సగటున హెక్టారుకు 1625 కిలోల దిగుబడి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మ డి జిల్లాలో రైతుల నుంచి దాదాపు 53,497 మెట్రిక్‌ టన్నుల శనగలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా. ఇందులో ప్రకాశం జిల్లాలో 30,300 మెట్రిక్‌ టన్నుల పంట ఉంది.


తొమ్మిది మండలాల్లో ఎక్కువ సాగు

మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కంభం, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, అర్ధవీడు, బేస్తవారిపేట, వెలిగండ్ల, తర్లుపాడు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగుచేశారు. ఇక్కడ 23,197 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చినట్టు అంచనా. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ. 5879 ఉంది. రైతులు పంట నాణ్యత చూసుకుని కొనుగోలు కేంద్రాల్లో ఆశించిన ధర పొందవచ్చని, మొత్తం 20 కేంద్రాల్లో కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ హరికృష్ణ తెలిపారు.

Updated Date - Feb 22 , 2026 | 10:55 PM