ప్రాణవాయువు.. తీశారు ఆయువు..!
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:42 PM
కొవిడ్ కారణంగా గతంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. రోగులతో వైద్యశాలలు కిక్కిరిశాయి.. ఆక్సిజన్ సైతం అందక బతుకు జీవుడా అంటూ రోదించిన సంఘటనలు అందరికీ గుర్తున్నాయి... అప్పట్లో ప్రజల ప్రాణాలు నిలిపేందుకు చీరాల ఏరియా వైద్యశాలలో రూ.1.06 కోట్లతో ప్రాణవాయువు ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
చీరాల ఏరియా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ మూత
రూ.1.06 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు
ప్లాంట్ తాళాలు కూడా తెరవని వైనం
ఎల్‌బీఎ్‌సనగర్(చీరాల), జూలై 28 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్ కారణంగా గతంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. రోగులతో వైద్యశాలలు కిక్కిరిశాయి.. ఆక్సిజన్ సైతం అందక బతుకు జీవుడా అంటూ రోదించిన సంఘటనలు అందరికీ గుర్తున్నాయి... అప్పట్లో ప్రజల ప్రాణాలు నిలిపేందుకు చీరాల ఏరియా వైద్యశాలలో రూ.1.06 కోట్లతో ప్రాణవాయువు ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వైద్యుల నిర్లక్ష్యంగా కేంద్రంపై పర్యవేక్షణ కొరవడింది. ఆ పరిస్థితి నుంచి కుదుటపడి ఏళ్లు గడుస్తున్నా కనీసం తాళాలు కూడా తెరవకపోవడంతో ప్రస్తుతం ప్లాంట్ పూర్తిగా మూలనపడింది. పరికరాలు కూడా నడిచే అవకాశం కూడా లేదు. తిరిగి వినియోగంలోకి తీసుకురావాలంటే లక్షలు పోయాల్సిందేనని భావిస్తున్నారు. వైద్యాఽధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తాజాగా మళ్లీ కొవిడ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అంతేగాక సాధారణ రోగులకు కూడా అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ అవసరం అని, వైద్యాధికారులు ఆదిశగా ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.