Share News

చరిత్రలో నిలిచేలా ఒంగోలు మునిసిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:05 AM

ఒంగోలు మునిసిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, కార్పొరేషన్‌ స్పెషలాఫీసర్‌ రాజాబాబు ఆదేశించారు

చరిత్రలో నిలిచేలా ఒంగోలు మునిసిపాలిటీ   150 ఏళ్ల వేడుకలు
మాట్లాడుతున్న స్పెషలాఫీసర్‌,కలెక్టర్‌ రాజాబాబు

కార్పొరేషన్‌ స్పెషలాఫీసర్‌ రాజాబాబు

ఒంగోలు కార్పొరేషన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, కార్పొరేషన్‌ స్పెషలాఫీసర్‌ రాజాబాబు ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రకాశం భవనంలోని సమావేశం మం దిరంలో కార్పొరేషన్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.పుస్తక ప్రదర్శనలు, ఆర్ట్‌ గ్యా లరీలు, హెరిటేజ్‌ వాక్‌, ప్ర ముఖల చిత్రాలతో ఫేమ్‌ వాల్‌ ఏర్పాటు, ప్రత్యేక సావనీర్‌ ఆవిష్కరణలు, మహిళలకు, యువతకు విద్యార్థులకు ఒంగోలు చరిత్రను తెలియజేసేలా షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రత్యేక డాక్యుమెంటరీ రూపకల్పన పోటీలు నిర్వహించాలన్నారు. ఫిట్‌ ఒంగోలు పేరుతో నగర పరిధిలో150 ప్రాంతాలలో మెడికల్‌ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇక నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక స్మారకాలు నిర్మించడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులతో ఈ ప్రణాళికను రెండు మూడు రోజుల్లో ఆవిష్కరించేలా దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో కమిషనర్‌ వెంకటకృష్ణయ్య, ఎంఈ ఐసయ్య, డీఈ పద్మజ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:05 AM