Share News

మద్యం దుకాణాలకు ఏడాది రెన్యువల్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 02:53 AM

మద్యం దుకాణాలకు ఏడాదిపాటు గడువు పెంచి రెన్యువల్‌ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 30 వరకు మాత్రమే మద్యం దుకాణాలకు గడువు ఉండటంతో టెండర్ల ప్రక్రియ కంటే ఏడాదిపాటు రెన్యువల్‌ చేసేందుకే పాలకులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

మద్యం దుకాణాలకు ఏడాది రెన్యువల్‌

ఫీజు 40శాతం పెంపు!

కట్టని వాటికి వెంటనే దరఖాస్తులు

నెలాఖరుకు ముగియనున్న గడువు

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మద్యం దుకాణాలకు ఏడాదిపాటు గడువు పెంచి రెన్యువల్‌ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 30 వరకు మాత్రమే మద్యం దుకాణాలకు గడువు ఉండటంతో టెండర్ల ప్రక్రియ కంటే ఏడాదిపాటు రెన్యువల్‌ చేసేందుకే పాలకులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో మద్యం ఆదాయా నికి గండిపడకుండా చూసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. మద్యం దుకాణాల యజమానుల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకొని చర్చించారు. ఉమ్మడి జిల్లాలో 188 మద్యం షాపులు ఉండగా ఎక్కువ శాతం మంది యజమానులు రెన్యువల్‌ చేసుకునేందుకు ముందుకు వస్తారన్న భావ నకు వచ్చారు. ఈ నేపఽథ్యంలో గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న లైసెన్స్‌ ఫీజు పది శాతం పెంచి.. పర్మిట్‌ రూంలకు పట్టణ ప్రాంతాల్లో రూ.7.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ.5లక్షలు ఒకేసారి వసూలు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. రెన్యువల్‌ ఫీజు పేరుతో 30శాతం మేరకు అదనంగా వసూలుకు సిద్ధమ వుతున్నట్లు సమాచారం. అంటే మొత్తంగా 40శాతం ఫీజును పెంచి మద్యం దుకాణాలను రెన్యువల్‌ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ప్రచారం ఉంది. అందుకు యజమా నులు ముందుకు రాని షాపులకు వెంటనే దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిన ఇతరులకు కేటాయించే అవకాశం ఉంది.

Updated Date - Sep 03 , 2026 | 02:53 AM