Share News

విద్యార్థి ఒకరు, డ్యూటీ 13 మంది!

ABN , Publish Date - Jun 04 , 2026 | 03:19 AM

ఇంటర్మీడి యేట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో బుధవారం విచి త్ర పరిస్థితి చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టును ఒక్క విద్యార్థి మాత్రమే ఎంపిక చేసుకున్నారు.

విద్యార్థి ఒకరు, డ్యూటీ 13 మంది!

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో విచిత్ర పరిస్థితి

ఒంగోలు విద్య, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడి యేట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో బుధవారం విచి త్ర పరిస్థితి చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టును ఒక్క విద్యార్థి మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఆ పరీక్ష మార్కాపురం జిల్లా పామూరులో జరిగింది. ఒక్క విద్యా ర్థి హాజరయ్యే పరీక్షకు 13 మంది అధికారులు, సిబ్బం దికి డ్యూటీ చేశారు. పరీక్షా కేంద్రం చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, ఒక ఇన్విజిలెటర్‌, ఇద్దరు బోధనేతర సిబ్బంది, ప్రశ్నపత్రాలను పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు తీసేందుకు ఇద్దరు జాయింట్‌ కస్టోడియన్లు, వైద్య సిబ్బంది, ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌, స్క్వాడ్‌ అధికారులు పనిచేశారు. తీరా పరీక్షకు ఫీజు చెల్లించిన ఆ విద్యార్థి కూడా గైర్హాజరయ్యారు. దీంతో ఆ విద్యార్థి పరీక్ష రాయకపోయినా 13మంది అధికారులు, సిబ్బంది డ్యూటీలో ఉండాల్సి వచ్చింది.

Updated Date - Jun 04 , 2026 | 03:19 AM