Share News

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:03 PM

ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

ఎమ్మెల్యే కందుల

మార్కాపురం వన్‌టౌన్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం బాలుర ఉన్నత పాఠశాలలో ఎప్‌ఎల్‌ఎన్‌ కెపాసిటీ బిల్డింగ్‌పై ఉపాధ్యాయులకు ఇస్తున్న ఆరు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుడు మాత్రమే ఉత్తమ సమాజాన్ని నిర్మిస్తారని, పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈ శిక్షణలో నూతన పాఠ్యపుస్తకాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవోలు రామ్‌దాస్‌ నాయక్‌, శ్రీనివాసులు, సుబ్రమణ్యం, టీ శ్రీనివాసులు, యూటీఎఫ్‌ నాయకులు వీరారెడ్డి శ్రీరాములు, కెఆర్‌పీలు వీరభద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:03 PM