Share News

ఒకరోజు ముందే..

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:51 AM

వరుసగా మూడో నెల కూడా ఒకరోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీని శనివారం ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్‌లను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఒకటో తేదీ సెలవుదినం అయితే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తోంది.

ఒకరోజు ముందే..

నే డే సామాజిక పింఛన్‌ల పంపిణీ

ఇరువురు మంత్రులతోపాటు పాల్గొననున్న నేతలు

ఒంగోలు, ఫిబ్రవరి 27 (ఆంధ్ర జ్యోతి): వరుసగా మూడో నెల కూడా ఒకరోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీని శనివారం ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్‌లను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఒకటో తేదీ సెలవుదినం అయితే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తోంది. అలా వరుసగా ఇప్పటికే రెండు నెలలు ముందుగానే ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 1న ఇవ్వాల్సిన పింఛన్‌ను నూతన సంవత్సర వేడుకల కారణంగా డిసెంబరు 31నే అందజేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం రావడంతో జనవరి 31నే ఇచ్చారు. మార్చి 1వతేదీ మళ్లీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే శనివారం పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది. అలా వరుసగా మూడో నెల కూడా లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పింఛన్‌ సొమ్ము అందనుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,19,557 మంది వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. వారికి రూ.95.38 కోట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం సంబంధిత సిబ్బంది శుక్రవారమే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేశారు. ఇదిలాఉండగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పేదల సేవలో పేరుతో నిర్వహిస్తున్న ప్రభుత్వం అధికార యంత్రాంగంతోపాటు కీలక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యులు కావాలని ఆదేశించింది. తదనుగుణంగా ప్రతినెలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. ఆ ప్రకారం శనివారం జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి జరుగుమల్లి మండలం దావగూడూరులో పాల్గొననున్నారు. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సంతమగులూరు మండలం ఏల్చూరులో హాజరవుతారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఇతర ముఖ్యనేతలు తమ తమ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 01:52 AM