ఒకరి మృతదేహం లభ్యం
ABN , Publish Date - Sep 08 , 2026 | 02:48 AM
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో కొట్టుకుపోయిన యువకుల్లో ఒకరి మృతదేహం సోమవారం లభ్యమైంది. మరొకరి అచూకీ లభించలేదు. మండలంలోని కటకానిపల్లె సమీపంలో ఫీడర్ కెనాల్‌లో ఈనెల 5న సరదాగా ఈతకు దిగిన పుప్పాల రాజ్‌కుమార్, పుప్పాల వినయ్‌కుమార్ గల్లంతయ్యారు.
ఒకరి మృతదేహం లభ్యం
ఫీడర్ కెనాల్‌లో మరొకరి కోసం గాలింపు ముమ్మరం
పెద్దదోర్నాల, సెస్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో కొట్టుకుపోయిన యువకుల్లో ఒకరి మృతదేహం సోమవారం లభ్యమైంది. మరొకరి అచూకీ లభించలేదు. మండలంలోని కటకానిపల్లె సమీపంలో ఫీడర్ కెనాల్‌లో ఈనెల 5న సరదాగా ఈతకు దిగిన పుప్పాల రాజ్‌కుమార్, పుప్పాల వినయ్‌కుమార్ గల్లంతయ్యారు. ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వినయ్‌కుమార్ (22) మృతదేహం చిక్కినట్టే చిక్కి నీటి ఉధృతికి జారిపోయింది. రెస్క్యూ టీమ్ గాలింపుచర్యలు ముమ్మరం చేయడంతో సోమవారం సాయంత్రం వినయ్‌కుమార్ మృతదేహం దొరికింది. ఈమేరకు ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. రాజ్‌కుమార్ కోసం గాలింపును వేగవంతం చేశారు.