వంద శాతం రాయితీతో ఆయిల్ పాం మొక్కలు
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:43 PM
వంద శాతం రాయితీతో ఒక హెక్టారుకు 125 మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఉద్యానశాఖ అధికారి హనుమంత్ నాయక్ చెప్పారు.
ఉద్యానశాఖ అధికారి హనుమంత్ నాయక్
మార్టూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి) : వంద శాతం రాయితీతో ఒక హెక్టారుకు 125 మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఉద్యానశాఖ అధికారి హనుమంత్ నాయక్ చెప్పారు. బొల్లాపల్లి రెవెన్యూ పరిధిలోని రైతులకు మంగళవారం ఆయిల్ పాం సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యానశాఖ అధికారి హనుమంత్ నాయక్ మాట్లాడుతూ ఆయిల్ పాం సాగు వలన 4 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు నిరంతర దిగుబడి, నిరంతర ఆదాయం వస్తుందన్నారు. ప్రాజెక్ట్ హెడ్ సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆయిల్ పాం టన్ను ధర ధర రూ.23,750 ఉందన్నారు. ఈ ఏడాది వంద హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆ తరువాత గ్రామంలోని రైతులు సాగు చేసిన 8 ఎకరాల ఆయిల్ పామ్ పంటను హనుమంత్ నాయక్‌తో పాటు, అజంతా సోయా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు సందర్శించారు.