డివిజన్ స్థాయి కౌన్సెలింగ్‌కు ఆటంకాలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 02:56 AM
ఉపాధ్యాయుల పని సర్దుబాటు కౌన్సెలింగ్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా యి. రెండో షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అయితే కేవలం మండల స్థాయి సర్దుబాటు మాత్రమే పూర్తయింది.
విడుదల కాని టీచర్ల సీనియారిటీ జాబితాలు
ఒంగోలు విద్య, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల పని సర్దుబాటు కౌన్సెలింగ్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా యి. రెండో షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అయితే కేవలం మండల స్థాయి సర్దుబాటు మాత్రమే పూర్తయింది. డివిజన్ స్థాయి కౌన్సెలింగ్‌ను శుక్రవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా సీనియారిటీ జాబితాలు, ఖాళీల వివరాలను డైరెక్టర్ కార్యాలయ ఐటీ విభాగం ఇవ్వకపోవడంతో అనివార్యంగా వాయిదాపడింది. సర్దుబాటు ప్రక్రియ మొత్తం ప్రారంభం నుంచి ముందుకు సాగడం లేదు. గురువారం సాయంత్రం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో పూర్వ విద్యా డివిజన్ స్థాయిలో సర్దుబాటు కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఉదయం 10గంటలకు జాబితాల ప్రకటిస్తామని రాష్ట్ర అధికారులు ప్రకటించారు. వాటి కోసం ఉదయం నుంచి ఎదురుచూసిన ఉప విద్యాధికారులకు చివరకు నిరాశే ఎదురైంది. ఒంగోలు డివిజన్‌లో నలుగురు మిగులు టీచర్లు శుక్రవారం కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. సాయంత్రం వరకు ఎదురుచూసి జాబితాలు రాకపోవడంతో ఉపవిద్యాధికారి రంగయ్య వారిని పంపించారు. జాబితాల విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలియక క్షేత్రస్థాయి అధికారులు గందరగోళానికి గురవుతున్నారు.