ఎన్టీఆర్ ఆశయాలే టీడీపీకి దిక్సూచి
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:03 AM
పేదల సంక్షేమం, తెలుగు జాతి గౌరవం కోసం దివంగత నందమూరి తారక రామారావు చూపిన మార్గంలో టీడీపీ ముందుకు సాగుతోందని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.
పర్చూరు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : పేదల సంక్షేమం, తెలుగు జాతి గౌరవం కోసం దివంగత నందమూరి తారక రామారావు చూపిన మార్గంలో టీడీపీ ముందుకు సాగుతోందని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో టీడీపీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణా శిభిరంలో ఆయన పాల్గొని ప్రసంగిం చారు. ఈ సందర్బంగా ఏలూరి మాట్లాడుతూ టీడీపీ కేవలం రాజకీయ పార్టీగా కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవం, శ్రామికుల కృషి, సామాన్యుడి ఆకాంక్షలను ప్రతి బింబించేలా ఆవిర్భవించిం దన్నారు. అట్టడుగు వర్గాలు, వృత్తి నిపుణులు, విద్యావేత్తలకు నాయకత్వ అవకాశాలు కల్పించిన ఏకైక పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జీఎసీ బాలయోగి, కింజరపు ఎర్రన్నాయుడు వంటి నాయకులతోపాటు, కెసీఆర్, రేవంత్ రెడ్డి వంటి అనేక మంది నాయకులు టీడీపీ వేదికపై ఎదిగారన్నారు. 1982లో ఎన్టీఆర్ చేపట్టిన చైతన్య రధయాత్ర తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో కీలక మలుపు అని ఆయన పేర్కొన్నారు. . భవిష్యత్ తరాలకు దారి చూపే నాయకత్వాన్ని అందించడంలో టీడీపీ ముందుంటుందన్నారు. ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దుష్పృచారాన్ని ఖండిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కృషి చేయాలన్నారు.