Share News

సంక్షేమానికి చిరునామా ఎన్టీఆర్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:24 AM

సంక్షేమ పథకా లకు చిరునామా ఎన్టీఆర్‌ అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మండలంలోని ఈతముక్కలలో గురువారం నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది.

సంక్షేమానికి చిరునామా ఎన్టీఆర్‌
విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల, ఇతర నాయకులు

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి

ఈతముక్కలలో ఘనంగా విగ్రహావిష్కరణ

కొత్తపట్నం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకా లకు చిరునామా ఎన్టీఆర్‌ అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మండలంలోని ఈతముక్కలలో గురువారం నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎంపీ మాగుంట, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సభకు ఈతముక్కల గ్రామ తెలుగుదేశం నాయకులు నందకుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ సూరారెడ్డి పాలెం-ఈతముక్కల రహదారిలో ఉన్న బకింగ్‌హాం కెనా ల్‌పై త్వరలో రూ.80 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టను న్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జనార్దన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ రాజకీయ, సినీ రంగంలో తిరుగులేని నాయకుడన్నారు. ప్రజాప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా అమలు చేస్తున్నదన్నారు. ఈతముక్కలలో పూర్తిస్థాయిలో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ రాచగొర్ల వెంకటరావు, మండల నాయకులు గేనం సుబ్బారావు, రామచంద్రగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 02:24 AM